cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేష్ ఆనంద్ మృతి.. ఎన్నో అనుమానాలు!

మహేష్ ఆనంద్ మృతి.. ఎన్నో అనుమానాలు!

90ల్లో విలన్ పాత్రలతో మెప్పించిన మహేష్ ఆనంద్ మృతిచెందారు. షెహన్ షా, స్వర్గ్, కురుక్షేత్ర, విజేత లాంటి ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించిన మహేష్ ఆనంద్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. పోలీసులు ఆయన భౌతికకాయాన్ని కుళ్లిపోయిన స్థితిలో కనుగొన్నారు. పోస్టుమార్టం జరిగితే తప్ప అసలు విషయాలు వెలుగులోకి రావు.

మహేష్ ఆనంద్ మద్యానికి బానిసయ్యాడని అంటారు తెలిసినవాళ్లు. ముంబయి పోలీసులు కూడా ప్రాధమికంగా ఇదే విషయాన్ని చెబుతున్నారు. అతిగా మద్యం సేవించిన మహేష్ ఆనంద్, గుండెపోటుతో మరణించి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మహేష్ చనిపోయిన టైమ్ లో అతడితో పాటు ఎవరున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు.

సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత పూర్తిగా మద్యానికి బానిసయ్యారట మహేష్ ఆనంద్. అతడి భార్య కూడా ప్రస్తుతం మహేష్ ఆనంద్ కు దూరంగా రష్యాలో ఉంటున్నారట. సినిమాల్లేక, కుటుంబ పరంగా కూడా ఒంటరి అయిపోవడంతో మహేష్ తీవ్ర నిరాశలో కుంగిపోయారని ఇరుగుపొరుగు వాళ్లు చెబుతున్నారు.

మరోవైపు దీనికి విరుద్ధమైన వాదన కూడా వినిపిస్తోంది. 12 ఏళ్లకు పైగా సినిమా అవకాశాల్లేని మహేష్ ఆనంద్ ఈమధ్య బాలీవుడ్ లో సినిమా చేశారు. ఆయన కెరీర్ మళ్లీ గాడిలో పడింది. ఇలాంటి టైమ్ లో అనుమానాస్పదంగా మృతిచెందారు మహేష్ ఆనంద్.

తెలుగులో ఎస్వీ కృష్ణారెడ్డి డైరక్ట్ చేసిన నంబర్ వన్ సినిమా మహేష్ ఆనంద్ కు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో మహేష్ ఆనంద్-బ్రహ్మానందం కామెడీ బాగా క్లిక్ అయింది. 

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా