cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాకంత సీన్ లేదు.. అందుకే తప్పుకున్నా..!

నాకంత సీన్ లేదు.. అందుకే తప్పుకున్నా..!

ఫస్ట్ టైం ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించి మీడియా ముందు రియాక్ట్ అయ్యాడు దర్శకుడు తేజ. తెరవెనక జరిగిన సంగతులు చెప్పకుండా, వివాదానికి దూరంగా స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో తప్పును తనపైన వేసుకున్నాడు. అవును.. తన చేతకానితనం వల్లనే ఎన్టీఆర్ బయోపిక్ ను డైరక్ట్ చేసే అవకాశాన్ని వదులుకున్నాడట తేజ.

"నేను ఎన్టీఆర్ బయోపిక్ కు న్యాయం చేయలేను అనిపించింది. నాకు అంత స్టామినా లేదనిపించింది. ఆయన జీవితాన్ని కథగా మార్చి సినిమాగా తీసేంత టాలెంట్ నాకు లేదనిపించింది. అందుకే తప్పుకున్నాను."

ఇలా నిందను తనపైన వేసుకున్నాడు తేజ. బాలకృష్ణతో తనకు ఎలాంటి సమస్య లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అవసరమైతే బాలయ్యను కొట్టి లేదా కాళ్లు పట్టుకొని తనకు కావాల్సిన అవుట్ పుట్ ను తెచ్చుకోగనని.. కానీ సబ్జెక్ట్ ను డీల్ చేయడం తనవల్ల కాక వదిలేశానని అంటున్నాడు.

"సినిమా ఓపెనింగ్ అయింది. అప్పటివరకు బాగానే ఉంది. దాని తర్వాత కథ లోతుల్లోకి వెళ్లి చూస్తే, కచ్చితంగా రామారావు గారికి న్యాయం చేయలేనని అనిపించింది. బాలకృష్ణతో సెట్ అవ్వక తప్పుకున్నాననేది పుకారు మాత్రమే. ఆయనతో సమస్యలేదు. కాళ్లు పట్టుకొని లేదంటే కొట్టి, తిట్టి ఎలాగోలా ఆయనతో చేయించుకుంటాను. నా వల్ల కాలేదు కాబట్టి వదిలేశాను."

తను డైరక్ట్ చేయలేదు కాబట్టే బయోపిక్ ఫ్లాప్ అయిందనే వాదనను ఖండించాడు తేజ. క్రిష్ కాకుండా తనే డైరక్ట్ చేసి ఉంటే ఇంతకంటే ఛండాలంగా సినిమా వచ్చేదేమో అనే అనుమానాన్ని వ్యక్తంచేశాడు. తన ముక్కుసూటితనంతో బయోపిక్ పై ఏదేదో మాట్లాడాల్సి వస్తుందని, ఏకంగా సినిమానే చూడలేదంటున్నాడు తేజ.

"ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు నేను చూడలేదు. ఒక్క ఫ్రేమ్ కూడా చూడలేదు. చూసిన తర్వాత నేనైతే ఎలా తీసేవాడ్ని అనే కంపేరిజన్స్ స్టార్ట్ అవుతాయి. ఎవరైనా అడిగితే ఓపెన్ గా చెప్పేయడం నాకు అలవాటు. ఎందుకొచ్చిన తలనొప్పి అని నేను మొత్తంగా చూడలేదు."

రాజకీయ నాయకులు ఐదేళ్లకు ఒకసారి మారితే, ఇండస్ట్రీ వాళ్లు ప్రతి శుక్రవారం మారిపోతారని విమర్శించాడు తేజ.. హీరోల్ని కొడతానని తనను దూరం పెట్టలేదని, హిట్స్ ఇచ్చి ఉంటే, కొట్టినా-తిట్టినా తనతోనే సినిమాలు చేసేవారని అన్నాడు. ఇండస్ట్రీకి మంచిచెడులు ఉండవని... కేవలం హిట్-ఫ్లాపులే ఉంటాయని అంటున్నాడు ఈ దర్శకుడు.

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ