cloudfront

Advertisement


Home > Movies - Movie News

అవును.. నాకు గ్లామర్ పాత్రలు రావడంలేదు

అవును.. నాకు గ్లామర్ పాత్రలు రావడంలేదు

హీరోయిన్ తాప్సి మరోసారి ఓపెన్ గా మాట్లాడింది. బాలీవుడ్ నుంచి తనకు గ్లామర్ పాత్రలు రావడం లేదని, లిప్ కిస్సులు పెట్టి, డాన్స్ చేస్తానన్నప్పటికీ తనను ఎవరూ ఆ యాంగిల్ లో చూడడం లేదని చెప్పుకొచ్చింది. కేవలం కొన్ని పాత్రలు మాత్రమే వస్తున్నాయని ఒప్పుకుంది.

"హిందీలో నాకు కమర్షియల్ సినిమాలు రావడం లేదు. వాళ్లు నన్ను అస్సలు గ్లామరస్ గా చూడడం లేదు. నటించడానికి అవకాశం ఉన్న సినిమాలే నాకు వస్తున్నాయి. నిజాయితీగా చెప్పాలంటే నాకంటే అందంగా ఉండే అమ్మాయిలు బాలీవుడ్ లో చాలామంది ఉన్నారు. బాగా డాన్స్ కూడా చేస్తారు. కమర్షియల్ సినిమాలు చాలా చేస్తున్నారు కూడా. సో.. వాళ్లను కాదని నా దగ్గరకు ఎవరొస్తారు. సో.. కమర్షియల్ సినిమాల కోసం వాళ్లను కాదని నా దగ్గరకు ఎవరూ రావట్లేదు."

మరోవైపు సినిమా అవకాశాలపై కూడా అంతే ఓపెన్ గా స్పందించింది తాప్సి. బాలీవుడ్ నుంచి తనకు అవకాశాలు తక్కువగా వస్తున్నయని ఒప్పుకుంది. ఇప్పుడు సౌత్ నుంచి కూడా ఛాన్సులు తగ్గిపోయాంటోంది. కాకపోతే వస్తున్న 2-3 సినిమాలు కూడా బాగుంటున్నాయని చెప్పుకొచ్చింది.

"నిజంగా చెబుతున్నాను. నాకు అవకాశాలు తక్కువగా వస్తున్నాయి. తక్కువ మంది నన్ను సంప్రదిస్తున్నారు. నేను సెలక్ట్ చేసుకోవడానికి ఎక్కువ ఆప్షన్లు లేవు. కానీ ఉన్నంతలో నా దగ్గరకు మంచి స్క్రిప్టులు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే కెరీర్ ఓకే."

నిర్మాతగా మారాలని తనకు కూడా ఉందని, కానీ మంచి పార్టనర్ కోసం చూస్తున్నానని తెలిపింది తాప్సి. ప్రస్తుతానికి తన దృష్టి మొత్తం నటనపైనే ఉందన్న తాప్సి, పెళ్లి ఆలోచన కూడా లేదని స్పష్టంచేసింది. ఎప్పుడైతే తనకు పిల్లలు కావాలనే కోరిక కలుగుతుందో అప్పుడు పెళ్లి చేసుకుంటానంటోంది.

తాప్సి ఫొటోస్ కోసం క్లిక్ చేయండి

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్