cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహేష్ సపోర్ట్ నాకు అవసరం లేదు

మహేష్ సపోర్ట్ నాకు అవసరం లేదు

ఎవరో అనడం లేదు ఈమాట. స్వయంగా కృష్ణ, మహేష్ కుటుంబానికి చెందిన సుధీర్ బాబు అంటున్నాడు. అవును.. మహేష్ సపోర్ట్ తనకు అక్కర్లేదంటున్నాడు సుధీర్ బాబు. సినిమాలకు సంబంధించి సపోర్ట్ అడిగితే, కృష్ణ కుటుంబాన్ని మరోసారి కట్నం అడిగినట్టు ఉంటుందని కుండబద్దలు కొట్టాడు.

"నేను సినిమాల్లోకి వచ్చిందే నా సంతృప్తి కోసం. మా నాన్న బిజినెస్ లో ఉదయం 10 నుంచి 5గంటల వరకు సంతకాలు పెట్టుకుంటే సరిపోతుంది. కాస్త ఆత్మ సంతృప్తి కోసమే సినిమా ఫీల్డ్ లోకి వచ్చాను. ఇక్కడ కూడా వీళ్లను, వాళ్లను అడగడం, వాళ్ల పేర్లు వాడుకోవడం నాకిష్టం లేదు. ఇంకెందుకు ఈ జీవితం. మనమీద బయటవాళ్లకు గౌరవం కూడా ఉండదు. సినిమాల్లో సపోర్ట్ అడిగితే, మరోసారి కట్నం అడిగినట్టే."

సుధీర్ బాబుకు తను ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని సమ్మోహనం ప్రీ-రిలీజ్ ఫంక్షన్ లో మహేష్ బాబు అన్నాడు. కేవలం ఆడియో ఫంక్షన్లకు మాత్రమే వస్తుంటామని అంతకుమించి చేసిందేం లేదన్నాడు. దీనిపై రియాక్ట్ అవుతూ.. పై విధంగా స్పందించాడు సుధీర్ బాబు. తను స్వతంత్రంగా ఉండడానికి ప్రయత్నిస్తానని, మహేష్ లాంటి హీరోల సపోర్ట్ తనకు అవసరం లేదని నిర్మోహమాటంగా చెబుతున్నాడు.

సమ్మోహనం సినిమాకు సంబంధించిన ఓ పుకారుపై కూడా క్లారిటీ ఇచ్చాడు సుధీర్ బాబు. తన సినిమాలో కాస్టింగ్ కౌచ్ గురించి అస్సలు చర్చించలేదని, తారల వ్యక్తిగత జీవితాల గురించి మాత్రం చిన్న డిస్కషన్ ఉంటుందని తెలిపాడు.

"ఎవరో ఒకర్ని వేలెత్తి చూపించినట్టు సినిమా ఉండదు. ఇండస్ట్రీని డౌన్ చేసినట్టు అస్సలు ఉండదు. మేం ప్రేమించి ఇష్టపడి పనిచేస్తున్న ఫీల్డ్ గురించి నెగెటివ్ గా చెప్పడం జరగదు. కాకపోతే తారలకు కూడా ఓ ప్రైవేట్ లైఫ్ ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశాం."

ఇకపై కూడా తన మనసుకు నచ్చినట్టు మాత్రమే సినిమాలు చేస్తానంటున్న సుధీర్ బాబు.. కేవలం కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా.. ప్రేక్షకులంతా తనను ఓ నటుడిగా గుర్తిస్తే చాలంటున్నాడు.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి