cloudfront

Advertisement


Home > Movies - Movie News

బిగ్‌బాస్ ఇంట ఓడుతూ ర‌చ్చ గెలుస్తున్న కౌశ‌ల్‌

బిగ్‌బాస్ ఇంట ఓడుతూ ర‌చ్చ గెలుస్తున్న కౌశ‌ల్‌

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని పెద్దలు స‌ల‌హాలిస్తుంటారు. ఈ మాట‌లో ఏదో అర్థం, ప‌ర‌మార్థం ఉండే ఉంటుంది. ఎందుకంటే పిల్లల శ్రేయ‌స్సు కోస‌మో పెద్దలు నీతి సూత్రాలు చెబుతుంటారు. అదేంటోగాని బిగ్‌బాస్ సీజ‌న్‌-2లో అన్ని చిత్రవిచిత్రాలు జ‌రుగుతున్నాయి. అదేమ‌ని అడిగితే... ఇది బిగ్‌బాస్ హౌస్‌... ఎప్పుడైనా ఏదైనా జ‌ర‌గొచ్చు అని గంభీర స్వరంతో బిగ్‌బాస్ త‌ర‌చూ హెచ్చరిస్తుంటారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అంటారు క‌దా? పోనీలెండి బిగ్‌బాసే చెప్పింత‌ర్వాత ఎవ‌రైనా మాట్లాడేది ఏముంటుంది?

బిగ్‌బాస్ హౌస్‌లో కౌశ‌ల్‌ను ఇంటి స‌భ్యులు ఇప్పటికి చాలాసార్లు నామినేట్ చేశారు. కాని కౌశ‌ల్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లేట‌ప్పుడు తెలివిగా త‌న‌కు మ‌ద్దతుగా ఆర్మీ టీంను ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ ఆర్మీనే అత‌నికి ర‌క్షణ‌గా నిలిచింది. కాని బిగ్‌బాస్ హౌస్‌లో స‌హ‌చ‌రుల అభిమానాన్ని కౌశ‌ల్ ఎందుకు పొంద‌లేక‌పోతున్నాడ‌నేదే ప్రధాన ప్రశ్న‌. ఇంటి స‌భ్యుల మ‌న‌సుల‌ను గెలిచి ఉంటే ప‌దేప‌దే నామినేట్ అయ్యే అవ‌కాశం వ‌చ్చేది కాదు క‌దా!

శ‌నివారం ఒక టాస్క్‌లో కౌశ‌ల్ గురించి ఒక ఇంటి స‌భ్యుడు రాసిందాన్ని బ‌ట్టి హౌస్‌లో అత‌నిపై అభిప్రాయం ఏంటో తెలిసిపోయింది. "అవ‌కాశ‌వాది... స్వార్థం, తోటివారు ఏమైనా ఫ‌ర్వాలేదు. సానుభూతి, ప్రశంస‌లు పొందాల‌ని చూస్తుంటాడు" అని కౌశ‌ల్ మ‌న‌స్తత్వంపై ఒక అజ్ఞాత ఇంటి స‌భ్యుడు ఆరోప‌ణ‌లు చేశారు. దీన్ని కౌశ‌ల్ ఖండించ‌డాన్ని కాసేపు ప‌క్కన పెడ‌దాం. ఒక టాస్క్ సంద‌ర్భంలో కౌశ‌ల్‌ తాను బిగ్‌బాస్ హౌస్‌లో బంధాలు, అనుబంధాలు పెట్టుకోడానికి రాలేద‌ని తేల్చి చెప్పాడు.

త‌న‌కు గేమ్ ముఖ్యమ‌ని, గెలుపు ప్రధాన‌మ‌ని త‌న ఆశ‌యాన్ని స్పష్టం చేశాడు. అలాంట‌ప్పుడు ఇత‌ర స‌భ్యులు అత‌నితో మాన‌సికంగా ఎలా క‌ల‌సిపోతారు? మ‌నుషుల‌న్న త‌ర్వాత ఒక‌ట్రెండు రోజులు క‌ల‌సి ఉన్నా అభిప్రాయాల్లో ఏకీభావం కుదురితే మాన‌సికంగా ద‌గ్గర‌వుతారు. త‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు మాత్రమే ఇంటి స‌భ్యుల‌కు ద‌గ్గర కావాల‌ని కౌశ‌ల్ కోరుకుంటాడు. కాని అవ‌త‌లి వారికి క‌ల‌వాల‌నే బ‌ల‌మైన కాంక్ష ఉండాలి క‌దా? కౌశ‌ల్ విష‌యంలో అలాంటిది జ‌ర‌గ‌డం వ‌ల్లే అత‌ను ఒంట‌రి వాడ‌య్యాడు.

స‌రే, కౌశ‌ల్ ఆర్మీ వ‌ల్ల అత‌ను నామినేష‌న్ నుంచి సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డుతున్నాడు. మ‌రో రెండు వారాల్లో అత‌ను విజేత‌గా కూడా బ‌య‌ట‌కు రావ‌చ్చు కూడా. కాని ఇంట గెల‌వ‌లేని వ్యక్తిలో ఏదో లోపం ఉన్నట్టే అనిపిస్తోంది. క‌నీసం ఈ రెండు వారాల్లోనైనా అత‌ను బిగ్‌బాస్ హౌస్‌తో పాటు ర‌చ్చ గెలిస్తేనే ఆ విజ‌యానికి ప‌రిపూర్ణత ల‌బిస్తుంది.