cloudfront

Advertisement


Home > Movies - Movie News

జనాలకు 'రోమియో'గాలం

జనాలకు 'రోమియో'గాలం

రవితేజ సరదా మాటలు, ఆలీ కితకితలు. టీజర్లో చూస్తే, బిసి సెంటర్ల జనాలు మరుక్షణం వెళ్లి సినిమా హాలు ముందు క్యూలో వుంటారు. ఇదీ రోమియో నిర్మాతల ఆలోచన. అందుకే ఆ విధంగా ట్రయిలర్ వదిలారు. నిజానికి టైటిళ్లపుడే విషయం తెలిసిపోతుంది. కామియో రోల్స్ వారివి అని. రవితేజ రెండు మూడు సార్లు, ఆలి ఒకటి రెండు సార్లు అలా కనిపించి, నాలుగు మాటలు ఫోన్లో చెప్పేసి వెళ్లి పోతారు. ఇప్పుడీ మాటల కోసం సినిమాకు వెళ్లడం కన్నా ట్రయిలర్లలో ఆ ముక్కలు వినేయడం బెటర్ అంటున్నారు విన్నవాళ్లు. ఎలాగూ వాళ్లు చెప్పే రెండు మాటలు ట్రయిలర్లోనే వున్నాయి. ఇక ఆపాటి దానికి థియేటర్ దాకా వెళ్లడం ఎందుకు టికెట్ దండుగ? అని చెబుతున్నారు సినిమా చూసినవాళ్లు. అయిన రోమియో గేలం వేస్తోంది. తగులుకున్నవారు తగులుకుంటారు.