cloudfront

Advertisement


Home > Movies - Movie News

కీర్తీ సురేష్.. బీజేపీనేనట!

కీర్తీ సురేష్.. బీజేపీనేనట!

నటి కీర్తీసురేష్ బీజేపీలోకి చేరనున్నారనే వార్తలపై ఆమె తల్లి మేనకా సురేష్  స్పందించారు. తాము బీజేపీ సానుభూతి పరులమే అని ఆమె స్పష్టంచేశారు. తన భర్తకు భారతీయ జనతా పార్టీ సభ్యత్వం ఉందని.. ఆయన బీజేపీలో యాక్టివ్ మెంబర్ అని ఆమె ప్రకటించింది. ఆ నేపథ్యంతో తాము బీజేపీ సానుభూతి పరులుగా కొనసాగుతున్నట్టుగా మేనక తెలిపింది.

ఇక తన కూతురు రాజకీయ ప్రవేశం గురించి మేనక స్పందించింది. ఇప్పుడప్పుడే ఆమె రాజకీయాల్లోకి రాదని పేర్కొంది. అయితే ఇటీవల మోడీని తాము కలిసినట్టుగా వివరించింది. తమ బోటీ కళాకారులందరినీ మోడీ పిలిపించారని.. సురేష్ గోపి, కవిత తదితరులంతా వెళ్లి మోడీని కలిసినట్టుగా మేనక వివరించింది. 

తాము బీజేపీకి అనుకూల వాదులం అని, అవసరమైన ప్రచారానికి వెనుకాడేది లేనట్టుగా మేనక తెలిపింది. మొత్తానికి యంగ్ హీరోయిన్ గా ఉన్నప్పుడే కీర్తీసురేష్ మీద ఇలా రాజకీయ ముద్ర పడుతున్నట్టుగా ఉంది. భవిష్యత్తుల్లో ఈ 'మహానటి' ప్రత్యక్ష రాజకీయాల్లోకి కూడా వస్తుందా?

జమ్మలమడుగులో కాయ్ రాజా కాయ్.. ఓన్లీ మెజారిటీ