cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

మహర్షి సినిమా ముచ్చట్లు!

మహర్షి సినిమా ముచ్చట్లు!

ఈ సినిమా యావరేజ్‌ అని 31.65శాతం మంది పేర్కొన్నారు. ఈ సినిమా ఫ్లాప్‌ అని 26.33శాతం మంది అభిప్రాయపడ్డారు. స్థూలంగా ఈ సినిమా యావరేజ్‌ అని, హిట్‌ అని తేల్చినవారే ఎక్కువ మంది ఉండటం గమనార్హం. నాలుగోవంతు మంది మాత్రం ఈ సినిమా ప్లాప్‌ అని తేల్చారు.

సినిమా ఆసాంతంలో రెండు సీన్లు బాగున్నాయి. మిగతా సినిమా అంతా ఆర్‌ఐపి. చాలా సీన్లు లెంగ్త్‌ ఎక్కువ అయ్యాయి. లాగారు. త్రీ ఇడియట్స్‌, శ్రీమంతుడు సినిమాలను మిక్స్‌ చేసినట్టుగా ఉంది. -ప్రతాప్‌

మహర్షి సినిమా పోల్‌
మహర్షి సినిమ తీర్పు విషయంలో నెటిజన్లు ఆసక్తిదాయకమైన రీతిలో స్పందించారు. ఈ సినిమాపై 'గ్రేట్‌ఆంధ్ర' పోల్‌పై భిన్నాభిప్రాయాలు వచ్చాయి. మహేశ్‌బాబు హీరోగా నటించిన ఈ తాజా సినిమా హిట్‌ అని 42.02శాతం మంది అభిప్రాయపడ్డారు.

'మహర్షి' సినిమా ఒక విందులా ఉంది. అందరికీ అన్నీ లభించాయి. కామెడీ, లవ్‌, సెంటిమెంట్‌, ఫన్‌ అండ్‌ మెసేజ్‌.. అన్నీ కలగలిపితే ఈ సినిమా. తెలుగు సినిమా చరిత్రలోనే ఇది ఒకానొక బెస్ట్‌ సినిమా. -సన్నీ

నటన విషయంలో మహేశ్‌బాబు మరీ బోర్‌ కొట్టిస్తున్నాడు. మరీ ఎక్స్‌ప్రెషన్‌ లెస్‌గా తయారవుతున్నాడు. అన్ని సినిమాల్లోనూ ఒకేతరహా ఎక్స్‌ప్రెషన్లతో కనిపిస్తున్నాడు. స్పైడర్‌ నుంచి మహర్షి వరకూ గమనిస్తే ఎక్స్‌ప్రెషన్ల విషయంలో అతడి ఫేస్‌ అన్ని సినిమాల్లోనూ ఒకేవిధంగా కనిపిస్తుంది. ఈ విషయాన్ని మహేశ్‌ అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. -రాజ్‌ కుమార్‌

ఇదొక అబౌవ్‌- యావరేజ్‌ సినిమా. సమ్మర్లో విడుదల అవుతున్న ఏకైక భారీ సినిమా కావడం దీనికి అడ్వాంటేజ్‌. మంచి కలెక్షన్స్‌ రావొచ్చు. అరవింద సమేత లేదా స్పైడర్‌లా ఇది చెత్త సినిమా కాదు. -ఓ నెటిజన్‌

మహేశ్‌బాబు చాలా ఎక్స్‌ పెరిమెంట్స్‌తో ఫ్లాప్స్‌ కొట్టాడు. ఇప్పుడు ఈ విషయాల్లో అతడు పునరాలోచించుకోవాలి. సింపుల్‌, కమర్షియల్‌ మాస్‌ ఎంటర్‌ టైనర్‌ చేయాలి. కనీసం డిస్ట్రిబ్యూటర్లకు లాస్‌ రాకుండా చూడాలి. -సంతోష్‌

మహర్షిని దెబ్బతీసే అంశాలు అవేనా!
ప్రిన్స్‌ మహేశ్‌బాబు సినిమా మహర్షి'ని ప్రధానంగా రెండు అంశాలు దెబ్బతీసేలా ఉన్నాయి. అందులో ఒకటి సినిమా లెంగ్త్‌ ఎక్కువ కావడం. ఈ రోజుల్లో కొన్ని సినిమాలు మూడు గంటల సమయం పాటు సాగి విజయం సాధించాయి. అయితే ప్రధానంగా కథను ఆధారంగా చేసుకున్న సినిమాలు. కథను చెబుతూ.. పోతూ.. రిపీటెడ్‌ సీన్లు రాకుండా ఉంటే సినిమా మూడు గంటలకు మించి సాగినా ఇబ్బందిరాదు.

అందుకు ఉదాహరణ 'అర్జున్‌ రెడ్డి'. అదొక వ్యక్తి కథగా.. మూడుగంటల పాటు సాగుతుంది. ఎక్కడా వచ్చిన సీన్లే రిపీట్‌ అయినట్టుగా ఉండదు. లేదా కొత్త కొత్త పాయింట్లను పెంచుతూ సినిమాను లాగడం ఉండదు. అదే 'మహర్షి' విషయానికి వస్తే.. ఒకదానికి ఒకటి పొడిగించుకుంటూ పోయారు. సెకెండాఫ్‌ వరకూ అసలు కథను చూపకుండా, ఊరి సమస్యను అసలు కథగా చూపి.. దానితోనైనా ఎండింగ్‌ ఇవ్వకుండా, మళ్లీ వ్యవసాయం మీదకు కథను మళ్లించారు.

బహుశా ఊరి సమస్యను మాత్రమే చూపితే అది పూర్తిగా 'శ్రీమంతుడు' అవుతుందేమో అని భయపడి.. మళ్లీ వ్యవసాయం కాన్సెప్ట్‌ను జోడించినట్టుగా ఉన్నారు. వ్యవసాయం గురించి చెప్పడం వరకూ ఓకే, అయితే అప్పటికే సినిమా లెంగ్త్‌ ఎక్కువైపోయింది. ఫైటింగులు రిపీట్‌ అయిపోయాయి. థియేటర్లో ప్రేక్షకుడికి బోర్‌ కొట్టేసింది. ఒకేతరహా ఎమోషన్స్‌ పదే పదే రిపీటవుతుంటే ఓపికగా ఎంతమంది కూర్చుంటారు?

ఇక రెండో అంశం ఈ సినిమా ఆసాంతం మరేవో సినిమాలు గుర్తుకు రావడం. తన తండ్రిని అవమానించిన అతడి ఆఫీసర్‌పై హీరో ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఎప్పుడో 'ఇడియట్‌' సినిమాలో చూసిన సీన్‌. తను ఎవరో తెలీయకుండానే తన తండ్రిపై వాడి మీద హీరో రీవేంజ్‌ తీర్చుకుంటాడు.

'ఇడియట్‌'తో మొదలుపెడితే..' త్రీ ఇడియట్‌' సినిమా గుర్తుకు వచ్చే సీన్లు బోలెడన్ని ఉన్నాయి. ప్రకాష్‌రాజ్‌ నవ్వు, మంచితనం కాన్సెప్ట్‌లు 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలో చూసినవే. ఆ సినిమాలో అతడి తీరును రావురమేశ్‌ తప్పు పడతాడు, ఈ సినిమాలో మహేశ్‌ బాబే తప్పు పడతాడు. ఇక శ్రీమంతుడు సినిమాను కూడా ఇది గుర్తుచేస్తుంది.

లెంగ్త్‌ ఎక్కువ కావడం ఒక తలపోటు అయితే, పదే పదే వేరే సినిమాలు గుర్తుకు వస్తుండటం మరో అంశం. ఈ మధ్య సినిమాల కథలు విన్నప్పుడు మహేశ్‌బాబు ఈ విషయాలను గమనిస్తున్నాడో లేదో మరి. 'భరత్‌ అనే నేను' సినిమాలో 'ఒకే ఒక్కడు' గుర్తుకు వచ్చింది. ఆ సినిమా 'లీడర్‌'ను కూడా జ్ఞప్తికి తెచ్చింది. ఇప్పుడేమో 'మహర్షి' బోలెడన్ని సినిమాలను గుర్తు చేస్తోంది.
-జీవన్‌

కలెక్షన్స్‌ విషయంలో.. ప్లస్‌లు మైనస్‌లు!
'మహర్షి'కి కలెక్షన్స్‌ విషయంలో కొన్ని ప్లస్‌ పాయింట్లు, మరికొన్ని మైనస్‌ పాయింట్లు ఉన్నాయి. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్‌ లభించాయి. మల్టీఫ్లెక్స్‌, ఏ సెంటర్‌, బీ సెంటర్‌ తేడా లేకుండా అంతటా మంచి వసూళ్లు దక్కాయి. మహేశ్‌ సినిమా ఓపెనింగ్స్‌ మీద ప్రేక్షకుల్లో మంచి క్యూరియాసిటీ కనిపించింది.

ఈ సినిమాను మహేశ్‌ అభిమానులు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు కూడా. మహేశ్‌ లేడీ ఫ్యాన్స్‌ మరోసారి ఫిదా అయిపోయారు. థియేటర్లలో వాళ్లు సినిమాలో లీనమైపోయి ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేస్తున్నారు. దీంతో అభిమానులను ఈ సినిమాతో మహేశ్‌ ఆకట్టుకున్నట్టే. కాట్టి వారి నుంచి ఫుల్‌ సపోర్ట్‌ ఉంటుంది.

సమ్మర్‌ కావడంతో ఈ సినిమా కలెక్షన్స్‌కు డోకా ఉండదు. ఫ్యామిలీ ఆడియన్స్‌, పిల్లలు ఈ సినిమాకు ఎగబడే అవకాశం ఉంది. మరే పెద్ద సినిమా పోటీలో లేకపోవడంతో ఈ సినిమా భారీ కలెక్షన్స్‌ను సంపాదించుకునే అవకాశం ఉంది.

అయితే తొలివారంలో ఐపీఎల్‌ మ్యాచ్‌లు ఈ సినిమాను కొంత ఇబ్బంది పెట్టవచ్చు. శుక్రవారం ప్లే ఆఫ్‌ మ్యాచ్‌ ప్రభావం, ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రభావం ఈ సినిమా వసూళ్లను కొంతలో కొంత ప్రభావితం చేయగలవు. అయితే అంతటితో ఐపీఎల్‌ ముగుస్తుంది. కాబట్టి మరీ ఇబ్బందిలేనట్టే.

అల్లరి నరేష్‌ ఇక అలా సెటిలవుతాడా!
హీరో పాత్రకు తను సైడ్‌ కిక్‌గా బాగా సెట్‌ అవుతాడనే విషయాన్ని మరోసారి రుజువు చేసుకున్నాడు అల్లరి నరేష్‌. ఎప్పుడో 'గమ్యం' సినిమాలో ఆ తర్వాత 'శంభో శివశంభో', తమిళులు తీసిన 'సంఘర్షణ' సినిమాల్లో అల్లరి నరేష్‌ హీరో పక్కన కనిపించి ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలు కమర్షియల్‌గా ఎంతవరకూ హిట్‌ అయ్యాయనేది పక్కన పెడితే... ఆ సినిమాల్లో అల్లరి నరేష్‌ సినీ ప్రియులకు గుర్తుండిపోతాడు. ఇప్పుడు 'మహర్షి' సినిమాతో కూడా అలాంటి గుర్తింపునే సంపాదించుకున్నాడు.

హీరోగా ఇప్పుడు అల్లరి నరేష్‌కు అంతగా హిట్స్‌లేవు. కామెడీ పేరుతో చేసిన ప్రయత్నాలతో తను విసిగించేశాడు. ఇలాంటి క్రమంలో ఈ తరహా పాత్రలను నరేష్‌ మరిన్ని చేయడానికి ఇప్పుడు అవకాశం ఏర్పడినట్టుగా ఉంది. ఎంతోకొంత ప్రాధాన్యత ఉన్న సైడ్‌ కిక్‌ పాత్రల్లో అల్లరి నరేష్‌ టాలీవుడ్‌ మూవీ మేకర్లకు ఒక ఛాయిస్‌ అవుతున్నాడు. ఇక నరేష్‌ ఇలా సెటిలవుతాడేమో!

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!