Advertisement


Home > Movies - Movie News
మెగాహీరోకు ఎక్కడలేని కోపం వచ్చేసింది

ఎప్పుడూ కూల్ గా సరదాగా ఉంటాడు అల్లు శిరీష్. తన ఫ్రెండ్స్ తో పాటు మీడియాతో కూడా నవ్వుతూ ఉంటాడు. మీడియా జనాలు అతడ్ని సీరియస్ గా చూసిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటి అల్లు శిరీష్ కు ఎక్కడలేని కోపం వచ్చేసింది. అది కూడా ఓ వ్యక్తి మీద కాదు, ఏకంగా ఓ వ్యవస్థ మీద. తన కోపం మొత్తాన్ని ట్విట్టర్ లో బయటపెట్టాడు ఈ మెగా హీరో.

"మీకు సంబంధించిన వాటి విలువ, అవి దూరమయ్యేంత వరకు మీకు తెలీదు. ఈమధ్యే ఎయిర్ టెల్ నుంచి వోడాఫోన్ కి మారాను. బ్యాడ్ నుంచి వరస్ట్ కు మారానని ఇప్పుడే అర్థమైంది. 4జీ సంగతి పక్కనపెట్టండి, చాలా సందర్భాల్లో కనీసం 2జీ కూడా పనిచేయదు. కాల్ డ్రాపింగ్ సంగతి వదిలేయండి, కనీసం సిగ్నల్ కూడా ఉండదు. ఓ మంచి గుణపాఠం నేర్చుకున్నాను" 

ఇలా తన కోపం మొత్తాన్ని వోడాఫోన్ పై ప్రదర్శించాడు అల్లు శిరీష్. అయితే వోడాఫోన్ పై కోపం అనే యాంగిల్ ను పక్కనపెట్టారు నెటిజన్లు. శిరీష్ కు అంత కోపం రావడానికి, ఆ టైమ్ లో ఈ హీరో ఎవరితో అంత ఇంట్రెస్ట్ గా మాట్లాడుతున్నాడబ్బా అంటూ ఆరాలు తీయడం స్టార్ట్ చేశారు నెటిజన్లు. నిజమే ఈ కాలం కుర్రాళ్లకు గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్ కట్ అయితే ఎక్కడలేని కోపం వచ్చేస్తుంది.