cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఈసారి థ్రిల్ ఇవ్వబోతున్న నాని

ఈసారి థ్రిల్ ఇవ్వబోతున్న నాని

లవ్ సినిమాలు చేశాడు.. డ్రామా పండించాడు.. యూత్ ఫుల్ మూవీస్ లో నటించాడు. కానీ ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఎప్పుడూ చేయలేదు నాని. ఆ అవకాశం ఇన్నాళ్లకు రానే వచ్చింది. నాని నెక్ట్స్ మూవీ ఓ థ్రిల్లర్ సినిమా. అది కూడా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో. అవును.. వీళ్లిద్దరి కాంబో సెట్ అయింది.

ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్నాడు నాని. ఈ సినిమా తర్వాత సెట్స్ పైకి వచ్చేది విక్రమ్ కుమార్ సినిమానే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై సెట్స్ పైకి రానుంది ఈ మూవీ. నిజానికి ఇదే బ్యానర్ పై కిషోర్ తిరుమల దర్శకత్వంలో నాని ఓ సినిమా చేయాలి. కానీ కిషోర్ తిరుమల స్థానంలో విక్రమ్ కుమార్ వచ్చి చేరాడు.

ఎట్టిపరిస్థితుల్లో హారర్ సినిమా చేయనని, కాస్త థ్రిల్ అనిపించే సబ్జెక్ట్ దొరికితే మాత్రం చేస్తానని గతంలోనే ప్రకటించాడు నాని. చెప్పినట్టుగానే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్రిల్లర్ కు ఓకే చెప్పాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో అరడజనుకు పైగా సినిమాలు చర్చల దశలో ఉన్నప్పటికీ విక్రమ్ కుమార్ చెప్పిన కథ బాగా నచ్చడంతో, ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

విక్రమ్ కుమార్ సినిమా తెరపైకి రావడంతో హను రాఘవపూడి, అవసరాల శ్రీనివాస్ తో చేయాల్సిన సినిమాలు ఇంకాస్త వెనక్కి వెళ్లాయి. కృష్ణార్జున యుద్ధంతో షాకిచ్చిన నాని, విక్రమ్ కుమార్ సినిమాతో ఎలాంటి థ్రిల్ ఇస్తాడో చూడాలి.