cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఆ ఒక్కటి అడక్కు.. బాంబు పేల్చిన నాగశౌర్య

ఆ ఒక్కటి అడక్కు.. బాంబు పేల్చిన నాగశౌర్య

మల్టీస్టారర్స్ చేస్తారా అనే ప్రశ్న ఎదురైతే హీరోలంతా చెప్పే సమాధానం ఒకటే. మంచి సబ్జెక్ట్ దొరికితే ఏ హీరోతోనైనా నటిస్తామంటారు. దాదాపు ఇదే తరహా ఆన్సర్ నాగశౌర్య నుంచి ఆశించింది మీడియా. కానీ ఈ హీరో మాత్రం రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఎవ్వరితో మల్టీస్టారర్స్ చేయనని కుండబద్దలుకొట్టాడు.

"నాకు కెరీర్ ప్రారంభం నుంచి మల్టీస్టారర్లపై పెద్దగా ఆసక్తి లేదు. ఎప్పుడో ఓసారి నారా రోహిత్ తో చేశాను. ఇక అంతే. భవిష్యత్తులో ఇక ఎవరితో చేయను కూడా. నాకు రోహిత్ బాగా తెలుసు. బాగా కనెక్ట్ అయ్యాడు కాబట్టి చేశాను. ఇక ఎవరితో చేయనంతే." 

రోహిత్ రేంజ్ లో భవిష్యత్తులో మరో హీరో కనెక్ట్ అయితే అతడితో మాత్రమే మల్టీస్టారర్ చేస్తానని, కానీ అలా జరిగే ఆస్కారం లేదంటున్నాడు నాగశౌర్య. గతంలో ఇద్దరు దర్శకులు మల్టీస్టారర్ కాన్సెప్టులతో తనను సంప్రదించినప్పటికీ తిరస్కరించానని తెలిపిన నాగశౌర్య.. ఆ దర్శకులు, ఆ సినిమాల్లో హీరోల పేర్లను వెల్లడించడానికి మాత్రం నిరాకరించాడు.

ప్రస్తుతం నర్తనశాల చిత్రాన్ని విడుదలకు సిద్ధంచేశాడు నాగశౌర్య. తన సొంత బ్యానర్ పై ఈహీరో చేసిన రెండో సినిమా ఇది. ఇక ఐరా క్రియేషన్స్ పై మూడో చిత్రాన్ని కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తానని, ఆ మూవీతో రమణ తేజ అనే మరో కొత్త దర్శకుడ్ని పరిచయం చేస్తానని ప్రకటించాడు.ఇలా ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై వరుసగా కొత్త వాళ్లకు అవకాశాలిస్తున్నాడు నాగశౌర్య.