cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఓ అమ్మ.. ఓ కూతురు.. మధ్యలో అల్లుడు

ఓ అమ్మ.. ఓ కూతురు.. మధ్యలో అల్లుడు

ఇగోయిస్ట్ అత్తగారు, అల్లరి అల్లుడు కాన్సెప్ట్ టాలీవుడ్ కు బంగారు బాతు లాంటిది. ఎన్ని గుడ్లు అయినా పెడుతూనే వుంటుంది. ఎటొచ్చే టైమ్ కు తగినట్లు దాన్ని కాస్త అటు ఇటుగా మార్చుకుంటూ కథ అల్లుకోగలగాలి. దర్శకుడు మారుతి ఇప్పుడు అదే చేసినట్లు కనిపిస్తోంది. తను అందిస్తున్న శైలజారెడ్డి అల్లుడు ట్రయిలర్ ను ఈ రోజు విడుదల చేసారు. 

ఇప్పటి వరకు వచ్చిన అత్త-అల్లుడు సినిమాలు అన్నీ ఆ రెండుపాత్రల నడుమ పోటాపోటీ వ్యవహారాలతో తయారైనవే. కానీ ఈసారి మారుతి, అత్త అల్లుడు అని కాకుండా, తల్లీ కూతుర్ల కాన్ ఫ్లిక్ట్ తో కథ అల్లి, అందులో అల్లుడిని ఇరికించి తమాషా చూసే, చూపే ప్రయత్నం చేసినట్లుంది. 

'నీకు కూడా నాలాగే ఇగో ఎక్కువని విన్నాను, దాని దమ్మెంతో చూడాలని అనుకుంటున్నాను' అని తల్లి కూతురుతో అన్న డైలాగ్ ట్రయిలర్ లో వినిపించింది. ఇదే చెబుతోంది సినిమా లైన్ ఏమిటి అన్నది. పైగా హీరో పరమసాప్ట్ కేండిడేట్ అని తనతోనే ట్రయిలర్ లో చెప్పించేసారు. కానీ అక్కడే చమక్కు ఏమిటంటే ఆ డైలాగ్ వేస్తూనే, ఓ మాంచి యాక్షన్ సీన్ కట్ చేసి వేయడం.

వెన్నెల కిషోర్, పృధ్వీలు కామెడీ సపోర్ట్ బాగానే తీసుకున్నట్లు కనిపిస్తోంది. అను ఇమ్మాన్యుయేల్ కు ఆఖరి చాన్స్ ఈ సినిమా. దీని ఫలితం బట్టే ఆమె కెరీర్ ఆధారపడి వుంటుంది. ఈ సినిమాకు నిర్మాతలు నాగవంశీ, పిడివి ప్రసాద్.