cloudfront

Advertisement


Home > Movies - Movie News

పక్కా లవ్ ఎంటర్ టైనర్ మాదిరిగా..

పక్కా లవ్ ఎంటర్ టైనర్ మాదిరిగా..

ఇవ్వాళ యూత్ కు నచ్చే బేసిక్ సబ్జెక్ట్ ఏమిటంటే.. లవ్ ఎంటర్ టైనర్. ప్రేమకు వీలయినంత వినోదం మిక్స్ చేస్తే, ఆ వినోదం కాస్త పండితేచాలు సినిమా జనాలకు రీచ్ అయిపోయినట్లే. కొత్త జోనర్ నా, కొత్త కథనా? కాదా? అన్నది అవసరం లేదు. హీరో రామ్ పక్కా హిట్ కోసం ఆ ప్రయత్నమే చేస్తున్నట్లు కనిపిస్తోంది హలోగురూ ప్రేమకోసమే సినిమాలో.

ఈ సినిమా మరోవారంలో జనాల ముందుకు వస్తుంది. ఇప్పుడు ట్రయిలర్ వచ్చింది. దర్శకుడు నక్కిన త్రినాధరావు, మాటల రచయిత బెజవాడ ప్రసన్న కలిసి కాస్త మ్యాజిక్ చేసినట్లే వుంది ట్రయిలర్ చూస్తుంటే. ట్రయిలర్ లో చకచకా చాలా డైలాగులే పడ్డాయి. ప్రతి డైలాగ్ బాగానే ఆకట్టుకునేలా వున్నాయి.

రామ్ మీసకట్టుతో డిఫరెంట్ గా వున్నాడు. అనుపమ మళ్లీ తన సహజమైన అందంతోనే కనిపించింది. దేవీశ్రీ బ్యాక్ గ్రవుండ్ స్కోర్, దిల్ రాజు పెట్టిన ఖర్చు ట్రయిలర్ లో కాస్త కనిపిస్తున్నాయి. సినిమా చూపిస్తామామా, నేను లోకల్ తరువాత నక్కిన త్రినాధరావు చేస్తున్న ఈ సినిమా దసరా సందర్భంగా 18న విడుదలవుతోంది.