cloudfront

Advertisement


Home > Movies - Movie News

పవన్ ఇంకాస్త టైమ్ తీసుకోవాల్సింది!

పవన్ ఇంకాస్త టైమ్ తీసుకోవాల్సింది!

మొన్న జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పవన్ పొలిటికల్ ఎంట్రీపై మరింత ఎక్కువగా కామెంట్స్ పడుతున్నాయి. ఎన్నికలకు ముందు పవన్ రాజకీయ రంగప్రవేశంపై పెద్దగా స్పందించని సినిమావాళ్లు, అతడు ఓడిపోయిన తర్వాత తమ అభిప్రాయాల్ని ఒక్కొక్కటిగా బయటపెడుతున్నారు.

తాజాగా నటుడు జేడీ చక్రవర్తి కూడా పవన్ ఎంట్రీపై స్పందించాడు. రాజకీయాల్లోకి వెళ్లడానికి పవన్ ఇంకాస్త టైమ్ తీసుకుంటే బాగుండేదని జేడీ చక్రవర్తి అభిప్రాయపడ్డాడు. సినిమావాళ్లు ఎవరైనా రాజకీయాల్లోకి వెళ్లొచ్చని, కానీ దానికి సమయం చాలా అవసరం అన్నాడు.

"సినిమా వాళ్లు పాలిటిక్స్ లోకి వెళ్లకూడదు, వెళ్లొచ్చు అనే రూల్స్ లేవు. కాకపోతే నా ఉద్దేశంలో అలాంటి వాళ్లంతా ఇంకాస్త ఎక్కువ టైమ్ తీసుకొని రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుంది. నా దృష్టిలో పవన్ కల్యాణ్ ఆ కేటగిరి. ఆయన ఇంకాస్త టైమ్ తీసుకోవాల్సింది."

ఇలా పవన్ చాలా తొందరగా రాజకీయాల్లోకి వెళ్లిపోయారనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాడు జేడీ చక్రవర్తి. పైగా పవన్ లాంటి ఎమోషనల్ వ్యక్తులు, ముందుగా తమ అభిప్రాయాల్ని ప్రజల్లోకి బలంగా పంపించిన తర్వాత రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని అన్నాడు.

"పవన్ చాలా ఎమోషనల్. ఆ విషయం నాకు తెలుసు. చాలామందికి తెలియదు. ప్రజలకు ఈ విషయం తెలియడానికి ఇంకాస్త టైమ్ పడుతుంది. మొన్న ఎన్నికల వేళ అంత టైమ్ దొరకలేదు. మరో ఐదేళ్లు టైమ్ ఉంది కాబట్టి ప్రజలు, పవన్ ఎమోషన్స్ ను అర్థంచేసుకుంటారు. అంతెందుకు, గతంలో చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగిందని నా ఉద్దేశం."

తనకు రాజకీయాలంటే అసహ్యం అంటున్నాడు జేడీ. తను మందు కొట్టనని, ఓడ్కా బాగుంటుంది తాగమంటే తనకు ఎంత అసహ్యమో.. రాజకీయాలపై స్పందించమంటే కూడా తనకు అంత అసహ్యమని అంటున్నాడు ఈ నటుడు.

పవనం ఏడాది పొడుగునా.. ఋతుపవనం సీజనల్‌.. మరి పవన్