cloudfront

Advertisement


Home > Movies - Movie News

2 సినిమాలు.. 3 రోజుల్లో.. చెరో వందకోట్లు!

2 సినిమాలు.. 3 రోజుల్లో.. చెరో వందకోట్లు!

సంక్రాంతి సందర్భంగా విడుదల అయిన రెండు భారీ తమిళ సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. రజనీకాంత్ ‘పేట” తమిళంతో పాటు తెలుగులో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక అజిత్ సినిమా విశ్వాసం తమిళంలో భారీ ఓపెనింగ్స్ ను పొందింది.

ఈ రెండు సినిమాల్లో తొలిరోజున అజిత్ సినిమానే లీడ్ లో నిలిచినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు ట్రేడ్ పండితులు రజనీకాంత్ సినిమాను అజిత్ సినిమా తొలిరోజు వసూళ్లలో అధిగమించిందని పేర్కొన్నారు. అయితే మూడో రోజుకు ఈ రెండు సినిమాలు వందకోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాయని వారు చెబుతున్నారు.

అటు పేట, ఇటు విశ్వాసం.. రెండు సినిమాలూ మూడో రోజుకు వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయని.. ప్రపంచ వ్యాప్తంగా కలిపి ఈ సినిమా ఈ మేరకు వసూళ్లు సాధించాయని ట్రేడ్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు.

వీటిలో పేట తెలుగులోకి కూడా అనువాదం అయ్యింది. అది రజనీకాంత్ సినిమాకు అదనపు అడ్వాంటేజ్ గా మారింది. విశ్వాసం కాస్త లేటుగా అయినా తెలుగులోకి అనువాదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో తెలుగు నటుడు జగపతి బాబు ముఖ్యపాత్రలో నటించాడు.

అజిత్ కు కొంతమేర గుర్తింపు ఉంది కాబట్టి.. విశ్వాసం తెలుగులోకి అనువాదం కావొచ్చు.

తేలని అభ్యర్థుల ఎంపిక.. పవన్ కల్యాణ్ పనే హాయి!

NTR బయోపిక్ గురించి తెలియని విషయాలు