cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఓవర్సీస్ లో మహర్షికి 3 రోజులు పట్టింది

ఓవర్సీస్ లో మహర్షికి 3 రోజులు పట్టింది

ప్రీమియర్స్ తో కలుపుకొని విడుదలైన మొదటి రోజుకే 10 లక్షల డాలర్లు ఆర్జిస్తుందని ట్రేడ్ అంచనా వేసింది. కానీ మిలియన్ డాలర్ క్లబ్ లో చేరడానికి మహర్షికి 3 రోజులు పట్టింది. శనివారం నాటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా 10 లక్షల డాలర్లు ఆర్జించింది. అది కూడా ప్రీమియర్స్ ఎమౌంట్ తో కలిపి.

ప్రీమియర్స్ - $ 516, 441
మొదటి రోజు - $ 176, 657
రెండో రోజు - $ 232, 325
మూడో రోజు - $ 178, 029
టోటల్ గ్రాస్ - $ 1.10 మిలియన్

ఈ సినిమాపై ఓవర్సీస్ లో భారీ హైప్ క్రియేట్ అయింది. కానీ ఆ క్రేజ్ కు తగ్గట్టు యూఎస్ లో థియేటర్లు దక్కలేదు. దీనికి కారణం అవెంజర్స్-ఎండ్ గేమ్. ఈ సినిమా అమెరికాను ఊపేస్తోంది. అందుకే మహర్షి ప్రీమియర్స్ కు బిగ్ స్క్రీన్స్ దొరకలేదు. కానీ ఉన్నంతలో  కాస్త ఎక్కువ స్క్రీన్స్ సంపాదించినప్పటికీ ప్రీమియర్స్ లో మహర్షి తేలిపోయింది.

నిజానికి ఈ సినిమా బాహుబలి-1 మొదటిరోజు వసూళ్లను క్రాస్ చేస్తుందని అంచనా వేసింది ట్రేడ్. కానీ అది సాధ్యం కాలేదు. బాహుబలి సిరీస్ తో పాటు ఖైదీనంబర్-150, అజ్ఞాతవాసి సినిమాలకు చాలా దూరంలో ఆగిపోయింది ఈ మూవీ. అంతెందుకు, మహేష్ నటించిన భరత్ అనే నేను, స్పైడర్ వసూళ్లను కూడా క్రాస్ చేయలేకపోయింది.

తాజా వసూళ్లతో ఓవర్సీస్ లో ఇది ఏ మేరకు పెర్ఫార్మ్ చేస్తుందనేది అనుమానంగా మారింది. ప్రీమియర్స్ తో కలుపుకొని మిలియన్ డాలర్ మార్క్ అందుకోవడానికి 3 రోజులు టైమ్ తీసుకున్న మహర్షి.. 2 మిలియన్ డాలర్ క్లబ్ లోకి ఎంటరవ్వడానికి కనీసం మరో 6 రోజులు పడుతుందని లెక్కలేస్తున్నారు.

గ్రేట్ ఇండియా ఫిలిమ్స్ సంస్థ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ను 11 కోట్ల 50 లక్షల రూపాయలకు దక్కించుకుంది. గల్ఫ్ రీజియన్, ఆస్ట్రేలియా థియేట్రికల్ రైట్స్ కూడా కలిపి ఈ మొత్తానికి సదరు సంస్థ దక్కించుకుంది. మహేష్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మక 25వ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ, వారం తిరిగేసరికి యూఎస్ లో ఏ మేరకు వసూళ్లు సాధిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

అమరావతి ఇంట్లో జగన్ ఎందుకు ఉండటం లేదంటే! 

మహర్షి ఒడిదుడుకుల ప్రయాణం!