cloudfront

Advertisement


Home > Movies - Movie News

అరాచకానికి ఫుల్ స్టాప్.. పెళ్లిచూపులు ఖతమ్

అరాచకానికి ఫుల్ స్టాప్.. పెళ్లిచూపులు ఖతమ్

బుల్లితెర ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టిన పెళ్లిచూపులు షో ను అర్థాంతరంగా ముగించబోతున్నారు. ప్రేక్షకుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత రావడంతో పాటు, రేటింగ్స్ కూడా దారుణంగా పడిపోవడంతో మధ్యలోనే ఈ షోను ముగించాలని నిర్ణయించింది స్టార్ మా యాజమాన్యం. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరో వారంరోజుల్లో పెళ్లిచూపులు దుకాణం సర్దేస్తారు.

ఇది పెళ్లిచూపులు కాదు, పెళ్లి'ఛీప్'లు అంటూ సోషల్ మీడియాలో కొన్ని రోజులుగా దుమారం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ క్లీన్ యాంకర్ గా, లక్షల మంది మహిళా ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొన్న సుమపై కూడా ఈ షో కారణంగా విమర్శలు చెలరేగాయి. దీంతో స్వయంగా ఆమె కూడా యాజమాన్యంపై ఒత్తిడి తీసుకురావడం మొదలుపెట్టారు.

మరోవైపు ప్రదీప్ సంగతి సరేసరి. ఇతడితో పెళ్లిచూపులేంటి అంటూ షో స్టార్ట్ అయిన మొదటి రోజే కామెంట్స్ పడ్డాయి. ఓ మన్మధుడిని చూసినట్టు అమ్మాయిలంతా ప్రదీప్ ను చూసి చొంగ కార్చడం, అతడి వైపు ఆబగా చూడడం, అర్రులుచాచడం, ప్రదీప్ కోసం కొట్టుకోవడం లాంటివి చూసి ఆడియన్స్ చిరాకుపడ్డారు. ఇదేం పైత్యంరా బాబూ అని కొందరు నవ్వుకున్నారు.

కంటెంట్ పరంగా విమర్శల్ని పక్కనపెడితే, రెవెన్యూ పరంగా కూడా ఇది పెద్ద ఫ్లాప్ షో అని తెలుస్తోంది. ఈ పెళ్లి'ఛీప్'ల కోసం భారీ సెట్స్ వేశారు నిర్వహకులు. మేకప్, కాస్ట్యూమ్స్, వెహికల్స్, ఫుడ్ కోసం కోట్లలో ఖర్చుచేశారు. సుమ, ప్రదీప్ ఎప్పీయరెన్స్ తో అంతా ఈజీగా రికవర్ అయిపోతుందని భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. మేకర్స్ కు కోట్లలో నష్టం వచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ షోలో పాల్గొన్న అమ్మాయిల్ని ఇప్పటికే ఇంటికి పంపించేశారు. ఇందులో పాల్గొనడం కోసం దుబాయ్, సింగపూర్ లాంటి దేశాల్లో మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్న అమ్మాయిలు సైతం వచ్చారు. వాళ్లందర్నీ నిర్మోహమాటంగా మధ్యలోనే తరిమేశారు. అంతేకాదు, షో ముగిసేవరకు పబ్లిక్ ఫంక్షన్లు, ప్రైవేట్ పార్టీల్లో కనిపించకూడదంటూ కండిషన్ పెట్టి మరీ పంపించారు.

మొత్తమ్మీద బిగ్ బాస్ సీజన్-2 తర్వాత ఆ స్థాయిలో జనాల్ని కట్టిపడేస్తుందని ఆశించిన పెళ్లిచూపులు షో అట్టర్ ఫ్లాప్ అయింది. ప్రస్తుతం ఈ ఛానెల్ బిగ్ బాస్ సీజన్-3 కోసం సీరియస్ గా చర్చలు జరుపుతోంది. వీలైనంత త్వరగా దాన్ని పట్టాలపైకి తీసుకురావాలని చూస్తోంది.

ఆత్మ గౌరవమా తోటకూర కట్టా.. కాంగ్రెస్ తరపున కొత్త దళారీ చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్