cloudfront

Advertisement


Home > Movies - Movie News

మీ-టూ ముగిసింది.. నేను సపోర్ట్ చేయను

మీ-టూ ముగిసింది.. నేను సపోర్ట్ చేయను

కాస్టింగ్ కౌచ్, మీ-టూ ఉద్యమంపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసింది హాట్ బ్యూటీ లక్ష్మీరాయ్. ఆ ఉద్యమం ముగిసిపోయిందని, ప్రజలంతా మరిచిపోయారని, అలాంటి దానిగురించి మాట్లాడుకోవడం వేస్ట్ అంటోంది. ప్రస్తుతం నడుస్తున్న మీ-టూ ఉద్యమం మొత్తం పక్కదారి పట్టిందంటోంది.

"మీ-టూ మూమెంట్ ముగిసిపోయింది. ఏదో జరుగుతుందని సంబరపడ్డాను. కానీ దురదృష్టవశాత్తూ ఏం జరగలేదు. ఇదొక మీడియా హైప్ గా మారింది. కొంతమంది అమ్మాయిల పేర్లు బయటకొచ్చిన విషయం నాకు తెలుసు. వాళ్లు చాలా నిజాయితీగా బయటకొచ్చారు. కానీ ఈ మీ-టూ ప్రక్రియ మొత్తం పక్కదారి పట్టింది. క్రమంగా ఇది వ్యక్తిగత కక్షగా మారిపోయింది."

ప్రస్తుతం నడుస్తున్న మీ-టూ ఉద్యమానికి తను ఎలాంటి మద్దతు ఇవ్వనని ప్రకటించింది రాయ్ లక్ష్మి. ఈ మొత్తం వ్యవహారంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలియనప్పుడు మద్దతు ఎలా ఇస్తామని ప్రశ్నించింది. మీ-టూ అనేది ఒకదశకు చేరుకొని మళ్లీ వెనక్కి వెళ్లిపోయిందని రాయ్ లక్ష్మీ అభిప్రాయపడింది.

"ఒకరిపై మరొకరు కక్ష తీర్చుకునే ఆయుధంగా ఇది మారిపోయింది. నాకు బ్రేక్ ఇవ్వకపోతే నీ గురించి చెడుగా మాట్లాడతా అనేవరకు వెళ్లిపోయింది. ఈ ఉద్యమాన్ని నేను సపోర్ట్ చేయదలుచుకోలేదు. సౌత్ కు సంబంధించినంత వరకు నేను కొన్ని మీ-టూ స్టోరీలు విన్నాను. అవి అబద్ధాలని నేను చెప్పను. సేమ్ టైం అవి పూర్తిగా నిజాలు కూడా కావు. ఇందులో అన్నీ ఉన్నాయి."

దాదాపు 15 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న తనకు ఇప్పటివరకు ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదంటోంది రాయ్ లక్ష్మి. ఇండస్ట్రీలో జనాలంతా కేవలం పని మీద దృష్టిపెడితే కాస్టింగ్ కౌచ్ అనేదే ఉండదంటోంది. 

ముఖ్యమంత్రి పదవి విలువనే దిగజార్చలేదా?

వాళ్లు ఎమ్మెల్యేలు, అదో మంత్రివర్గమా?