cloudfront

Advertisement


Home > Movies - Movie News

మహానటిని అస్సలు పట్టించుకోలేదు: రాజమౌళి

మహానటిని అస్సలు పట్టించుకోలేదు: రాజమౌళి

మహానటి ఓ మహాద్భుతం. ప్రేక్షకుల నుంచే కాకుండా సినీ ప్రముఖుల నుంచి వస్తున్న ఒకే ఒక్క మాటిది. సెంటర్ తో సంబంధం లేకుండా అన్ని ఏరియాస్ నుంచి, అన్ని వర్గాల నుంచి ఏకపక్షంగా వినిపిస్తున్న మాటిది. కానీ రాజమౌళి మాత్రం రివర్స్ అయ్యాడు. మహానటి సినిమాను తను అస్సలు పట్టించుకోలేదన్నాడు.

"నిజం చెప్పాలంటే ఈ సినిమా విడుదలకు 4-5రోజుల ముందు వరకు మహానటిపై పెద్దగా నమ్మకం గానీ, అభిప్రాయం గానీ నాకు లేదు. మా కుటుంబ సభ్యులు, పిల్లలు మాటిమాటికి ఈ సినిమా గురించి మాట్లాడుతుంటే కాస్త ఆసక్తి కలిగింది. వాళ్లే నాక్కూడా టిక్కెట్ తీశారు. అలా సినిమా థియేటర్ కు వెళ్లిన నేను, సినిమాతో పూర్తిగా కనెక్ట్ అయిపోయా. మహానటిలో ప్రతి అంశం నాకు నచ్చింది."

ఇలా మహానటిపై తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు రాజమౌళి. అంతేకాదు.. సినిమాకు సంబంధించి అశ్వనీదత్ ను సన్మానిస్తామని తనకు చెప్పినప్పుడు కూడా చాలా కోపం వచ్చిందంటున్నాడు రాజమౌళి. 

"అరవింద్ గారు ఫోన్ చేసి అశ్వనీదత్ గారిని సన్మానిద్దాం.. నువ్వు రావాలని పిలిచినప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. సినిమా చేసింది దత్తు గారి పిల్లలు. వాళ్లు కష్టపడి చేస్తే, ఆ క్రెడిట్ అంతా దత్తు గారికి ఇవ్వడం నాకు నచ్చలేదు. నిజంగా దత్తు గారిని సన్మానించాలంటే ఒక యాంగిల్ లో సత్కరించాలి. ఇంత టాలెంట్ ఉన్న పిల్లల్ని కన్నందుకు దత్తు గారిని సన్మానించాలి." 

మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి తర్వాత అల్లు అరవింద్, బన్నీ కలిసి మహానటి యూనిట్ ను సన్మానించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళిని ఆహ్వానించారు. ఈ వేదికపై మహానటి సినిమాపై, ఆ సినిమా యూనిట్ పై ఇలా ప్రశంసలు కురిపించాడు రాజమౌళి.

ఫొటోస్ కోసం క్లిక్ చేయండి