cloudfront

Advertisement


Home > Movies - Movie News

సస్పెన్స్ కు తెర.. సూపర్ స్టార్ మళ్లీ ఎన్నికలకు దూరం

సస్పెన్స్ కు తెర.. సూపర్ స్టార్ మళ్లీ ఎన్నికలకు దూరం

అదిగో జెండా అంటే ఇదిగో పార్టీ అన్నారు అభిమానులు. ఇలా నడిచింది రజనీకాంత్ రాజకీయ వ్యవహారం. గతేడాది డిసెంబర్ నుంచి తన రాజకీయ పార్టీపై, పొలిటికల్ స్టెప్స్ పై ఫీలర్లు వదులుతున్న రజనీకాంత్, ఇప్పటివరకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాలేదు. వస్తున్నానని మాత్రమే చెబుతూ వచ్చారు. రాబోతున్న లోక్ సభ ఎన్నికల్లో రజనీకాంత్ పార్టీ పోటీచేస్తుందని అంతా అనుకున్నారు. కానీ సూపర్ స్టార్ ఈసారి కూడా రాజకీయాలకు దూరంగానే ఉన్నారు.

"రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మా పార్టీ ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు. కాబట్టి ఎవరూ నా ఫొటో గానీ, రజనీ మక్కల్ మండ్రమ్ కు చెందిన నా జెండా గానీ ఉపయోగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏదో ఒక పార్టీకి ప్రచారం చేయడానికి లేదా మద్దతు తెలపడానికి నా ఫ్యాన్ క్లబ్ ను వాడకూడదు."

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీచేయడం లేదని ప్రకటిస్తూనే, తన పార్టీ మద్దతు ఎవరికీ ఉండంటూ ఇలా  ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు రజనీకాంత్. తనది ఆధ్యాత్మిక పార్టీ అని నిజాయితీగా, నిష్కల్మషంగా తన పార్టీ ఉంటుందని పదేపదే చెబుతున్న రజనీకాంత్, ఈసారి కూడా తన ఓపెన్ లెటర్ లో అవే విషయాల్ని మరోసారి గుర్తుచేశారు. అయితే ఓటర్లకు ఓ పిలుపు మాత్రం ఇచ్చారు రజనీ. తమిళనాడులో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించే సుస్థిర రాజకీయ పార్టీకే ఓటేయాలని పిలుపునిచ్చారు.

తాజా స్టేట్ మెంట్ తో రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశానికి ఇంకా చాలా టైం పడుతుందనే విషయం అందరికీ అర్థమైంది. మరోవైపు కమల్ హాసన్ మాత్రం పొలిటికల్ గా ఏమాత్రం తగ్గడంలేదు. ఓవైపు వరుసగా సినిమాలు చేస్తూనే మరోవైపు పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగడానికి సిద్ధమని కమల్ ఇదివరకే ప్రకటించారు. తమ భావజాలానికి దగ్గరగా ఉండే పార్టీలతో పొత్తుపెట్టుకోవడానికి కూడా సిద్ధమని ప్రకటించారు.

బాబు పాలనపై గ్రేట్ ఆంధ్ర సర్వే ఫలితాలు!

ప్రజాస్వామ్యానికే పెనుముప్పుగా మారిన వైనం!