cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి పిల్లల కోసం ప్రయత్నించారా?

ఎన్టీఆర్ తో లక్ష్మీపార్వతి పిల్లల కోసం ప్రయత్నించారా?

వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా..? అసలు ఈ పుకారులో నిజమెంత? ఈ ప్రశ్న వర్మకు కూడా ఎదురైంది. ఎన్టీఆర్ ద్వారా పిల్లల్ని కనేందుకు లక్ష్మీపార్వతి ప్రయత్నించారని, దానికోసం ఎన్టీఆర్ కు కొన్నిరకాల మందులు ఇవ్వడం వల్లనే ఆయనకు గుండెపోటు వచ్చిందనే కథనానికి సంబంధించి తనకు ఎక్కడా ఆధారాలు దొరకలేదంటున్నాడు రామ్ గోపాల్ వర్మ.

"ఎన్టీఆర్ ద్వారా పిల్లల్ని కనేందుకు లక్ష్మీపార్వతి ప్రయత్నించారనే విషయంపై నాకు సాక్ష్యాలు దొరకలేదు. ఎవరో ఊహల నుంచి వచ్చిన విషయం ఇది. ఇదొక ఫాంటసీ ఆలోచన. దానికి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. ఈ విషయాన్ని రామారావు గారు లేదా లక్ష్మీపార్వతి చెప్పాలి. లేదంటే మందులు ఇచ్చిన డాక్టర్ చెప్పాలి. అలాంటి ఆధారాలు నాకు దొరకలేదు".

తన సినిమాలో ఎన్టీఆర్-లక్ష్మీపార్వతి మధ్య అనుబంధం గురించి ప్రస్తానవ ఉండదంటున్నాడు వర్మ. అసలు వీళ్లిద్దరి కలయిక ఎలా జరిగిందనేదే తనకు చాలా ఆసక్తికరమైన అంశమని, దాని చుట్టూనే ఎక్కువ సీన్స్ రాసుకున్నానని అంటున్నాడు.

"ఎన్టీఆర్ పెద్ద స్టార్. అప్పట్లో ఆయన సూపర్ స్టార్. చాలా పవర్ ఫుల్, పాపులర్. లక్ష్మీపార్వతి అనే ఆవిడ ఓ సాధారణ మహిళ. పెద్ద అందగత్తె కూడా కాదు. అలాంటి లక్ష్మీపార్వతి ఏ విధంగా ఎన్టీఆర్ కు దగ్గరయ్యారు, అలా దగ్గరయ్యే ఛాన్స్ ఆమెకు ఎలా వచ్చింది అనేది నా బిగ్గెస్ట్ క్వశ్చన్. దాన్ని బేస్ చేసుకొని నేను రీసెర్చ్ చేశాను. ఆ గ్రాఫ్ నుంచే సినిమా వచ్చింది."

క్రిష్ తీస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్-1లో ఎన్టీఆర్ సినీజీవితం, పార్ట్-2లో రాజకీయ జీవితం ఉంటాయని.. తను తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఎన్టీఆర్ వ్యక్తిగత జీవితాన్ని చూడొచ్చని అంటున్నాడు. క్రిష్ తీస్తున్న బయోపిక్ లో ఎంత వాస్తవం ఉంటుందో, తనతీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కూడా అంతే వాస్తవికత ఉంటుందంటూ తెలివిగా సమాధానమిచ్చాడు ఆర్జీవీ.

సాయి పల్లవి మీద వచ్చేవన్నీ రూమర్స్.. శర్వా సర్టిఫికెట్ 

పోర్న్ నిషేధం.. స్త్రీ వాదుల నుంచి వ్యతిరేకత! చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్