cloudfront

Advertisement


Home > Movies - Movie News

రాజమౌళి కథ చెప్పిన తర్వాత నోట మాటరాలేదు

రాజమౌళి కథ చెప్పిన తర్వాత నోట మాటరాలేదు

ఆర్-ఆర్-ఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ ను బయటపెట్టాడు రామ్ చరణ్. రాజమౌళి ఈ సినిమా కథ చెప్పిన తర్వాత కాసేపు అలా సైలెంట్ అయిపోయానని, ఆశ్చర్యంతో నోట మాటరాలేదని అంటున్నాడు. జక్కన్న చెప్పిన కథ అంత అద్భుతంగా ఉందని స్పష్టంచేశాడు.

"రాజమౌళి కథ చెప్పడం పూర్తయిన తర్వాత అంతా నిశ్శబ్దం. ఒక షాక్ లో అలా ఉండిపోయాను. ఇలాంటి ఆలోచన కూడా వస్తుందా అనే ఆశ్చర్యంతో అలా కాసేపు సైలెంట్ గా ఉండిపోయాను. పక్కనే ఉన్న తారక్ ఫస్ట్ రియాక్ట్ అయ్యాడు. ఆ సైలెన్స్, ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు కాస్త టైం పట్టింది."

ఇలా ఒక అద్భుతమైన కథతో రాజమౌళి తనను పడేశాడని చెప్పుకొచ్చాడు చరణ్. ఎన్టీఆర్ కు తనకు విడివిడిగా కథ చెప్పలేదని, ఇద్దర్నీ కూర్చోబెట్టి ఒకేసారి కథ చెప్పాడని స్పష్టంచేసిన చెర్రీ.. కాలిఫోర్నియా వెళ్లింది కూడా సినిమా కోసమే అని తేల్చిచెప్పాడు.

"రాజమౌళి మమ్మల్ని సెలక్ట్ చేసుకున్న తర్వాత కథ అనుకోలేదు. కథకు మమ్మల్ని ఫిక్స్ చేసిన తర్వాతే మా ఇద్దర్నీ కూర్చోబెట్టి కథ చెప్పారు. ఇద్దరు ఆర్టిస్టులు దొరికేశారని రాజమౌళి కథ అల్లరు. అది ఆయన నైజం కాదు. రాజమౌళి సినిమా పని మీదే నేను, తారక్ కాలిఫోర్నియా వెళ్లాం. చిన్న గ్రాఫిక్ వర్క్ కోసం ఇద్దరం కలిసి వెళ్లాం."

మరోవైపు తారక్ తో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు చరణ్. సోషల్ మీడియా బాగా విస్తరించడంతో తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని అంతా అనుకుంటున్నారని, కానీ ఎప్పట్నుంచో తారక్, తను మంచి స్నేహితులమని అన్నాడు.

"మిగతా హీరోలతో బాండింగ్ విషయానికొస్తే ఎప్పట్నుంచో నేను మిగతా హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటాను. సోషల్ మీడియాలో చూసిన తర్వాత జనాలకు ఇప్పుడిప్పుడే మేం కలుస్తున్నాం అని అనిపించొచ్చు. కానీ మేం చాన్నాళ్లుగా క్లోజ్. తారక్ నే తీసుకుంటే, చాలా ఏళ్లుగా మేమిద్దరం ఫ్రెండ్స్. మహేష్ తో ఈమధ్య కాలంలో బాగా కలుస్తున్నాను."

రాజమౌళి సినిమాలో పెద్దగా మేకోవర్లు ఉండవని, ఓ సాధారణ కుర్రాడు ఎలా ఉంటాడో అలానే చాలా సాదాసీదాగా కనిపిస్తానని అంటున్నాడు చరణ్. ఎన్టీఆర్ క్యారెక్టర్ లో మాత్రం మేకోవర్ ఉంటుందని తెలిపాడు. 

రామ్ చరణ్ ఫోటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండి 

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?