Advertisement


Home > Movies - Movie News
"రాజ వంశస్థుడు"గా రామ్ చరణ్

రంగస్థలం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు రామ్ చరణ్. కాస్త రెస్ట్ తీసుకుని త్వరలోనే బోయపాటి సినిమా స్టార్ట్ చేస్తాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయింది. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ నుంచి చరణ్ సెట్స్ పైకి వెళ్తాడు. ఇదిలా ఉండగా ఈ సినిమాకు ఓ క్లాసికల్ టైటిల్ అనుకుంటున్నాడు బోయపాటి.

రామ్ చరణ్ మూవీకి రాజ వంశస్థుడు అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుందా అనే ఆలోచనలో ఉన్నాడట బోయపాటి. నిజానికి తన సినిమాలకు మాస్ టైటిల్స్ పెట్టడం బోయపాటి స్టయిల్. కానీ జయజానకి నాయక సినిమా నుంచి టైటిల్స్ విషయంలో ట్రెండ్ మార్చాడు. మూవీ మాస్ గా ఉన్నప్పటికీ టైటిల్ క్లాస్ గా పెట్టాలనుకుంటున్నాడు. ఇందులో భాగంగానే చరణ్ మూవీకి రాజవంశస్థుడు అనే టైటిల్ పెడితే బాగుంటుందని భావిస్తున్నాడు.

మెగా కాంపౌండ్ లో ఓ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేయాలంటే అది ఏ ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. చిరంజీవి, అల్లు అరవింద్ నుంచి మొదలుపెడితే చాలామంది అంగీకారం కావాలి. సో.. మాస్ జనాలకు దూరంగా, పక్కా క్లాస్ గా ఉన్న ఈ టైటిల్ మెగామోదం పొందుతుందని ఊహించలేం.

కాకపోతే మెగా కాంపౌండ్ నుంచి ఇలాంటి లీకులు కామనే. మనసులో ఓ టైటిల్ అనుకున్న వెంటనే లీకులు వదలవడం, నలుగురికి నచ్చితే దాన్నే ఫిక్స్ చేయడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అందులో భాగంగానే ఈ టైటిల్ బయటకొచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని టైటిల్ కూడా వస్తాయి. ఎలాంటి సందేహం అక్కర్లేదు.