cloudfront

Advertisement


Home > Movies - Movie News

24 గంటల పాటు 365 రోజులు కష్టపడ్డాను

24 గంటల పాటు 365 రోజులు కష్టపడ్డాను

రంగస్థలం సినిమా గురించి ఫస్ట్ టైం పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడాడు రామ్ చరణ్. తన కెరీర్ లో సినిమాలన్నీ ఒకెత్తు. రంగస్థలం సినిమా ఒక్కటి మరో ఎత్తు అంటున్నాడు.

"పదేళ్ల కెరీర్ నాది. నటుడిగా ఇది నాకు 10వ సంవత్సరం. నా కెరీర్ లో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్, ది బెస్ట్ సినిమా రంగస్థలం. ఈ సినిమా కచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈ సినిమా కోసం 12 నెలల పాటు 365 రోజులు పనిచేశాను."

ఈ సినిమా కోసం దాదాపు ఏడాది పాటు గడ్డం పెంచానని, జస్ట్ 2రోజుల కిందటే గడ్డం తీసానని చెబుతున్నాడు చరణ్. గడ్డం మిస్ అయినందుకు బాధగా ఉందన్న చెర్రీ, భవిష్యత్తులో రంగస్థలం లాంటి సినిమా మళ్లీ చేయలేనేమో అంటున్నాడు.

"నా సినిమాలు చూడమని నేనెప్పుడూ అడగను. కానీ రంగస్థలం సినిమాను మాత్రం కచ్చితంగా చూడండి. ఎందుకంటే ఇది వెరీ వెరీ స్పెషల్ మూవీ. కెరీర్ లో ప్రతిసారి ఇలాంటి సినిమా చేయడం కుదరదు. ఇది బ్యూటిఫుల్ సినిమా."

మార్చి 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది రంగస్థలం. రేపు విశాఖలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను చేయబోతున్నారు.