cloudfront

Advertisement


Home > Movies - Movie News

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ప్రేమ జంట

మళ్లీ పెళ్లి చేసుకోబోతున్న ప్రేమ జంట

బాలీవుడ్ హాట్ ప్రేమ జంట దీపిక పదుకోన్, రణ్వీర్ సింగ్ పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఈరోజు ఈజంట మళ్లీ పెళ్లి చేసుకోబోతోంది. అవును.. నిన్న కొంకణి సంప్రదాయంలో వివాహం చేసుకున్న రణ్వీర్-దీపిక.. ఈరోజు సింధి ట్రెడిషన్ లో మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు.

గతంలో నాగచైతన్య-సమంత కూడా ఇలానే పెళ్లి చేసుకున్నారు. క్రిస్టియన్, హిందూ సంప్రదాయాల్లో వీళ్ల పెళ్లి జరిగింది. త్వరలోనే ప్రియాంక చోప్రా, నిక్ కూడా హిందూ-క్రిస్టియన్ పద్ధతుల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోబోతున్నారు. రణ్వీర్-దీపిక ఇద్దరూ హిందువులే అయినప్పటికీ, పెళ్లి సంప్రదాయాలు వేర్వేరు. అందుకే కొంకణి-సింధి పద్ధతుల్లో వివాహం వీళ్లు పెళ్లి చేసుకుంటున్నారు.

ఇటలీలోని ఖరీదైన ఐలాండ్ లో రణ్వీర్-దీపికల వివాహం గ్రాండ్ గా జరుగుతోంది. లేక్ కోమో ఐలాండ్ లో జరుగుతున్న ఈ వివాహ వేడుకకు పెళ్లికొడుకును ఖరీదైన కార్గో షిప్ లో తీసుకొచ్చారు. అక్కడ్నుంచి, తను నటించిన గుండే సినిమాలోని ఓ పాటకు డాన్స్ చేస్తూ, మంటపానికి చేరుకున్నాడు రణ్వీర్ సింగ్. ఈ వేడుకకు షారూక్, ఫరాఖాన్, సంజయ్ లీలా భన్సాలీ, కరణ్ జోహార్ హాజరయ్యారు.

పెళ్లి తతంగాన్ని ఫొటోలు తీయకూడదంటూ ఆహూతులకు కండిషన్ విధించారట. అంతేకాకుండా అందరికీ క్యూఆర్ కోడ్ తో కూడిన సెక్యూరిటీ కార్డులు కూడా ఇచ్చారు. ఇలా కట్టుదిట్టమైన భద్రత మధ్య పెళ్లిచేసుకుంటోంది ఈ జంట. పెళ్లి తర్వాత బెంగళూరు, ముంబయిలో 2 రిసెప్షన్లు ఏర్పాటు చేయబోతున్నారు. 

మీటూ.. ప్రైవేట్ సెటిల్ మెంట్లు జరుగుతున్నాయా? ...చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్