cloudfront

Advertisement


Home > Movies - Movie News

డబ్బు కోసం తీసిన సినిమా కాదిది

డబ్బు కోసం తీసిన సినిమా కాదిది

యాత్ర సినిమాలో నటించినప్పటికీ సినిమా మొత్తాన్ని ప్రేక్షకులతో కలిసి చూశాడు రావురమేష్. సినిమా చూసిన తర్వాత తన భావోద్వేగాల్ని ఆపుకోలేకపోయాడు. మీడియాతో మాట్లాడుతూ తన మనసులో ఉన్న భావాల్ని బయటపెట్టాడు రావురమేష్.

"ఎలా పడితే అలా తీసే సినిమా కాదిది. కొన్ని సెన్సిటివ్ అంశాల్ని టచ్ చేయకూడదు. ఆ స్క్రిప్ట్ అలాంటిది. ఎవర్నీ ఎత్తిచూపించలేదు. నాయకుడు ఊరికేరాడు. సినిమా చూసిన తర్వాత ఓ నాయకుడు ఎలా పుడతాడో తెలిసింది. పాదయాత్రలో జనాల కష్టాల్ని కవర్ చేసిన విధానం మనసును తాకింది. ఏదో వాగ్దానాలు ఇచ్చినట్టు కాకుండా, ప్రతి గుండెను టచ్ చేసింది యాత్ర."

విలేజ్ లో వినాయకుడు సినిమా టైమ్ లో మహి వి రాఘవ్ తో ట్రావెల్ చేసినప్పటికీ, అతడిలో ఇంత టాలెంట్ ఉందనే విషయం యాత్ర సినిమాతోనే తెలిసిందంటున్నాడు రావురమేష్. ఓ మహానాయకుడి జీవితానికి సంబంధించి కీలకమైన ఘట్టాన్నీ తీసుకొని స్క్రిప్ట్ రాయడం అనేది మామూలు విషయం కాదని, డబ్బులు ఆశిస్తే ఇలాంటి స్క్రిప్ట్ రావంటున్నారు రావు రమేష్.

"ఒక ఇంటిని సర్దుకోవడానికే చాలా టైం పడుతుంది. పిల్లల జీవితాలు చక్కదిద్దాలి. అలాంటిది జనాలందరి కష్టాలు తెలుసుకొని, వాటిని తనవిగా ఫీల్ అయి, నేనున్నాను నేను చూసుకుంటానని చెప్పడం గ్రేట్ లీడర్స్ కే సాధ్యం. ఎక్కడ్నుంచి అంత ధైర్యం వస్తుంది. సినిమా చూస్తున్నంతసేపు నా మనసు కదిలిపోయింది."

వైఎస్ఆర్ పాత్రలో మమ్ముట్టి నటించారనే కంటే ఆ పాత్రలోకి వెళ్లిపోయారనడం కరెక్ట్ అంటున్నాడు రావు రమేష్. సినిమా చూసిన తర్వాత ఆగలేక రాత్రి 10 గంటలకే మమ్ముట్టికి ఫోన్ చేశానని కానీ ఆయన లిఫ్ట్ చేయలేదన్నారు. మర్నాడు ఉదయం ఇద్దరం మాట్లాడుకున్నామని తెలిపాడు.

యాత్ర సినిమాలో తనకు బాగా నచ్చిన సన్నివేశాల్ని మీడియాతో పంచుకున్నారు రావురమేష్. దీన్నొక పొలిటికల్ సినిమాగా చూడొద్దని, ఒక టైమ్ లో ప్రజల కష్టాలు ఎలా కష్టపడ్డారో తెలుసుకోవాలంటే యాత్ర చూడాలని అంటున్నాడు. 

రాజకీయంలో డబ్బే డబ్బు.. ఇదే రాజకీయ సిద్ధాంతం..!

వైఎస్సార్ డైలాగ్స్ పబ్లిక్ చెప్తే.. ఆ కిక్కే వేరప్పా