cloudfront

Advertisement


Home > Movies - Movie News

నా ఫోన్ మోగుతూనే ఉంది.. అప్పుడే అర్థమైంది

నా ఫోన్ మోగుతూనే ఉంది.. అప్పుడే అర్థమైంది

ఓ సినిమా సక్సెస్ అయిందా లేదా? దీనిపై స్టార్స్ ఒక్కొక్కరు ఒక్కో విధంగా రెస్పాండ్ అవుతుంటారు. సోషల్ మీడియా ఫాలో అవుతామని కొందరు అంటే, తెలిసినవాళ్లు చెబుతారని మరికొందరంటారు. ఈ విషయంలో సాయితేజ్ కు కూడా ఓ లాజిక్ ఉంది. దాని పేరు ఫోన్ లాజిక్.

అవును.. ఓ సినిమా సక్సెస్ అయిందో లేదో తన ఫోన్ చెప్పేస్తుందంటున్నాడు సాయితేజ్. సినిమా సక్సెస్ అయితే వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉంటాయని, ఫ్లాప్ అయితే ఒక్క కాల్ కూడా రాదని అంటున్నాడు. ఈ విషయాన్ని ఓ సీనియర్ జర్నలిస్ట్ తనకు చెప్పాడని.. అది తన విషయంలో ఎప్పుడూ జరుగుతుంటుందని తెలిపాడు.

వరుసగా 6 ఫ్లాపులిచ్చినప్పుడు తనకు ఎవరూ ఫోన్లు చేయలేదని, విన్నర్ సినిమాకు మొదటిరోజు ఫోన్ చేసినా సాయంత్రానికి ఆ కాల్స్ కూడా తగ్గిపోయాయని తెలిపాడు సాయితేజ్. అయితే చిత్రలహరి సినిమాకు మాత్రం పొద్దుట్నుంచి తన ఫోన్ మోగుతూనే ఉందని తెలిపిన తేజూ.. ఇప్పటికీ తనకు కాల్స్ వస్తూనే ఉన్నాయని, సినిమా హిట్ అయిందనే విషయాన్ని అలా తెలుసుకున్నానని అన్నాడు.

సెకెండాఫ్ కాస్త స్లోగా ఉందనే విమర్శపై కూడా స్పందించిన ఈ హీరో, కథలో ఎత్తుపల్లాలు సహజమని.. ఓవరాల్ గా సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ వచ్చిందా లేదా అనేది ముఖ్యమంటున్నాడు. ఆ విషయంలో చిత్రలహరి సినిమా ఆడియన్స్ కు ఓవరాల్ గా ఓ ఎమోషనల్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చిందని అంటున్నాడు.

వార్ వన్ సైడే.. నా? ఎవరి లెక్కలు వారివి!