cloudfront

Advertisement


Home > Movies - Movie News

ఐయామ్ ఫైన్.. నాకు కాన్సర్ లేదు

ఐయామ్ ఫైన్.. నాకు కాన్సర్ లేదు

2 రోజులుగా బాలీవుడ్ లో ఒకటే పుకారు. హీరో షాహిద్ కపూర్ కు కాన్సర్ సోకిందనేది ఆ రూమర్. ఉదరకోశ కాన్సర్ తో షాహిద్ బాధపడుతున్నాడని, ప్రస్తుతం అది చివరి దశలో ఉందంటూ సోషల్ మీడియాలో వరుసపెట్టి కథనాలు వచ్చాయి. ప్రస్తుతం అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో నటిస్తున్న ఈ హీరో, త్వరలోనే అమెరికా వెళ్లి కాన్సర్ ట్రీట్ మెంట్ తీసుకుంటాడంటూ కథనాలు వచ్చాయి.

షాహిద్ కపూర్ ఆరోగ్య పరిస్థితిపై అతడి కుటుంబ సభ్యులు ఇప్పటికే రియాక్ట్ అయ్యారు. కాన్సర్ రూమర్లను కొట్టిపారేశారు. అయినప్పటికీ ఈ ఊహాగానాలు ఆగలేదు. దీంతో స్వయంగా షాహిద్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. నేరుగా అతడే తన ఆరోగ్య స్థితిపై ట్వీట్ చేశాడు.

తను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, గాలికబుర్లను అస్సలు నమ్మొద్దని షాహిద్ ట్వీట్ చేశాడు. దీంతో ఈ టాపిక్ కు ఫుల్ స్టాప్ పడింది. అయితే షాహిద్ ప్రకటించిన తర్వాత ఈ ఇష్యూ మరో విధంగా టర్న్ తీసుకుంది. 3 రోజుల నుంచి ఇంత సీరియస్ డిస్కషన్ నడుస్తుంటే ఎందుకు రియాక్ట్ అవ్వలేదని షాహిద్ ను ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

షాహిద్ మాత్రం తను చెప్పాలనుకున్నది చెప్పేశాడు. ప్రస్తుతం ఈ హీరో దృష్టి మొత్తం కబీర్ సింగ్ సినిమా (అర్జున్ రెడ్డి రీమేక్) పైనే ఉంది. సందీప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ లో విడుదల చేయబోతున్నారు.

టిఆర్ఎస్ గెలిస్తే ఎం జరుగుతుంది?..కూటమి గెలిస్తే ఏమవుతుంది?