cloudfront

Advertisement


Home > Movies - Movie News

నాగశౌర్య తిడితే శర్వానంద్ పొగుడుతున్నాడు

నాగశౌర్య తిడితే శర్వానంద్ పొగుడుతున్నాడు

ఒకే హీరోయిన్ విషయంలో ఇద్దరు హీరోలు డిఫరెంట్ గా రియాక్ట్ అయితే అది కచ్చితంగా ఎట్రాక్ట్ చేస్తుంది. ఇప్పుడు సాయిపల్లవి విషయంలో కూడా అదే జరుగుతోంది. గతంలో ఈ హీరోయిన్ ను నాగశౌర్య ఓపెన్ గానే తిట్టిన విషయం తెలిసిందే. సాయిపల్లవి ఈగోను, తలబిరుసును తను భరించలేకపోయానని చెప్పాడు. భవిష్యత్తులో ఆమెతో సినిమా చేయననే అర్థం వచ్చేలా మాట్లాడాడు.

అయితే శర్వానంద్ మాత్రం సాయిపల్లవిని వెనకేసుకొచ్చాడు. పడిపడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవితో కలిసి నటించిన ఈ హీరో, ఆమెను ఆకాశానికెత్తేశాడు. తనలో ఎప్పుడూ ఇగోను చూడలేదని ప్రకటించి, నాగశౌర్యకు ఝలక్ ఇచ్చాడు.

"సెట్స్ లో సాయి పల్లవిని చూస్తే ఆశ్చర్యమేసింది. నటించేటప్పుడు ఆమె చాలా డీటెయిలింగ్ లోకి వెళ్లిపోతుంది. ఆమె అంత నేచురల్ గా నేను నటించలేను. పైగా ఆమె ఎక్కడా ఇగో ఫీల్ అవ్వదు. చాలా మంచి పిల్ల. అప్పటివరకు నేను సాయిపల్లవి గురించి ఏదేదో విన్నాను, ఈ సినిమా సెట్స్ లో ప్రత్యక్షంగా చూశాను."

ఇలా నాగశౌర్య స్టేట్ మెంట్ కు పూర్తి భిన్నంగా స్పందించాడు శర్వానంద్. పడి పడి లేచే మనసు సినిమాలో సాయి పల్లవి తనను డామినేట్ చేయలేదంటున్నాడు శర్వానంద్. ఒకవేళ కొన్ని సన్నివేశాల్లో తనను సాయిపల్లవి డామినేట్ చేసినా అది తనకు ఆనందమే అంటున్నాడు. 

జగన్, పవన్ కలిసి పనిచేసినా మాకు ఓకే 

త్వరలో ఎన్నికలు.. కాంగ్రెస్ తో పొత్తూ వికటించింది.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్ 

కేసీఆర్, బాబు పాలనపై సీనియర్ జర్నలిస్ట్ ఏమన్నారంటే?

వెల్లువెత్తిన అభిమానం మినిష్టర్ క్వార్ట్రర్స్ జామ్ ఎక్కడంటే