cloudfront

Advertisement


Home > Movies - Movie News

సినిమాల్లోనే కాదు, బయట కూడా కామెడీనే!

సినిమాల్లోనే కాదు, బయట కూడా కామెడీనే!

అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలో ఇలియానా హీరోయిన్. ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే చాలామంది మరిచిపోయిన విషయం ఒకటుంది. ఈ సినిమాలో ఇలియానా కంటే ముందు అను ఎమ్మాన్యుయేల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. మూవీ ఓపెనింగ్ కు కూడా అను వచ్చింది. రవితేజ పక్కన నిల్చొని ఫొటోలకు పోజులు కూడా ఇచ్చింది.

కట్ చేస్తే, కొన్ని కారణాల వల్ల అను స్వయంగా తప్పుకోవడంతో, ఆ స్థానంలో ఇలియానా వచ్చి చేరింది. సరిగ్గా ఇక్కడే దర్శకుడు శ్రీనువైట్ల కామెడీ చేస్తున్నాడు. ఈ స్టోరీ రాస్తున్నప్పుడే మైండ్ లో ఇలియానాను ఫిక్స్ అయ్యానంటూ కామెడీ పండిస్తున్నాడు.

"ఈ క్యారెక్టర్ రాస్తున్నప్పుడు నా మైండ్ లో ఫస్ట్ వచ్చిన హీరోయిన్ రూపం ఇలియానా. ప్రారంభంలో చాలామంది హీరోయిన్లను అనుకున్నాం కానీ ఫైనల్ గా ఇలియానాను తీసుకురాగలిగాం."

నిజంగా ఇలియానాను అనుకుంటే ఆమెనే తీసుకోవాలి. రీఎంట్రీ కోసం ఇలియానా కూడా చాన్నాళ్లుగా ఎదురుచూస్తోంది. కానీ ఆమెను కాదని అను ఎమ్మాన్యుయేల్ ను తీసుకున్నారు. ఆ తర్వాత వ్యక్తిగత కారణాల వల్ల ఈ ప్రాజెక్టు నుంచి అను ఎమ్మాన్యుయేల్ తప్పుకుంది.

అప్పటికే రవితేజతో ఉన్న పరిచయం కారణంగా ఇలియానా ఈ సినిమాలోకి ఈజీగా ఎంట్రీ ఇచ్చేసింది. ఈ ఎపిసోడ్ మొత్తాన్ని వైట్ల మరిచిపోయినట్టున్నాడు. లేకపోతే జనాలు మరిచిపోతారని భావించి ఉంటాడు. అందుకేనేమో కేవలం ఇలియానా కోసమే ఈ క్యారెక్టర్ రాసుకున్నానంటూ ఆసువుగా చెప్పేశాడు.

అన్నట్టు ఈ సినిమాకు ఇలియానా సొంతంగా తెలుగులో డబ్బింగ్ చెప్పుకుంది. ఆమె తెలుగులో డబ్బింగ్ చెప్పుకున్న మొట్టమొదటి సినిమా ఇదే. రీఎంట్రీలో ఆమె సాధించిన పురోగతి ఇది.

జగన్ ను పరామర్శించాడు.. జంప్ కూడా చేస్తాడా? చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్