cloudfront

Advertisement


Home > Movies - Movie News

తమన్నతో అనుకుంటే కీర్తికి వర్కవుట్ అయింది

తమన్నతో అనుకుంటే కీర్తికి వర్కవుట్ అయింది

తెలుగులో లేడీ ఓరియంటెడ్ సినిమాలంటే అందరిచూపు అనుష్క పైనే పడుతుంది. కానీ అన్నిరకాల కథల్ని ఆమె అంగీకరించదు. ఇప్పుడిప్పుడే కొన్ని కథలు కీర్తిసురేష్ వైపు కూడా వెళ్తున్నాయి. మధ్యమధ్యలో తమన్న కూడా ఇలాంటి స్టోరీలు ఒప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో తమన్న చేయాల్సిన ఓ సినిమా అనుకోకుండా కీర్తిసురేష్ చెంతకు చేరింది.

మహిళా ప్రాధాన్యం కలిగిన కథతో ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈరోజు ఓ సినిమా ప్రారంభమైంది. కీర్తిసురేష్ ను ఇందులో హీరోయిన్ గా తీసుకున్నారు. నిజానికి ఇది కీర్తిసురేష్ చేయాల్సిన సినిమా కాదు. మొదట ఈ కథను తమన్నాకు వినిపించారు. ఆమె కూడా దాదాపు ఓకే చెప్పేసింది. కాకపోతే ఇతర సినిమాలతో బిజీగా ఉండడం వల్ల తర్వాత చేస్తానని చెప్పింది.

ఈ గ్యాప్ లో మహానటి రావడం, ఈ కథను కీర్తిసురేష్ చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఈ సినిమాతో నరేంద్ర దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. అన్నపూర్ణ స్టుడియోస్ లో జరిగిన ఈ మూవీ ఓపెనింగ్ కు కల్యాణ్ రామ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు.

వచ్చేనెల నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. దాదాపు 75శాతం షూటింగ్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. కథ అలా డిమాండ్ చేస్తోందట.

కీర్తిసురేష్ మూవీ ఓపెనింగ్ ఫొటోస్ కోసం క్లిక్ చేయండి 

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది