cloudfront

Advertisement


Home > Movies - Movie News

తండ్రీకొడుకులతో 'బంగార్రాజు'.. సంక్రాంతి రిలీజ్?

తండ్రీకొడుకులతో 'బంగార్రాజు'.. సంక్రాంతి రిలీజ్?

దాదాపు రెండేళ్లుగా నలుగుతున్న బంగార్రాజు ప్రాజెక్టుపై ఇప్పుడిప్పుడే కదలిక వస్తోంది. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. అంతా అనుకుంటున్నట్టు ఇది కేవలం నాగార్జున సోలో సినిమా కాదు. ఇందులో నాగచైతన్య కూడా కనిపించబోతున్నాడు. అవును.. నాగ్-చైతూ కాంబోలో రాబోతోంది బంగార్రాజు.

కల్యాణ్ కృష్ణ ఈ మేరకు కథలో చేయాల్సిన మార్పులన్నీ చేశాడు. నిజజీవితంలో తండ్రికొడుకులైన నాగార్జున, నాగచైతన్య.. ఈ సినిమాలో మాత్రం తాత-మనవడు పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగచైతన్య చేయాల్సిన వెంకీ మామ ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత బంగార్రాజు సినిమా సెట్స్ పైకి వస్తుందట. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనేది ప్లాన్. 

మనం సినిమాలో కథ ప్రకారం, నాగార్జునకు నాగచైతన్య తండ్రి అయ్యాడు. ఆ విషయాన్ని చాలా కన్విన్సింగ్ గా చూపించారు. బంగార్రాజులో నాగచైతన్యకు తాతగా కనిపించబోతున్నాడు నాగార్జున. మరి బంగార్రాజు సినిమాలో ఈ ఎలిమెంట్ ను ఎలా చూపిస్తారో చూడాలి. అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మాతగా రాబోతోంది ఈ సినిమా.