cloudfront

Advertisement


Home > Movies - Movie News

దొంగతనంగా పెళ్లి చేసుకోను

దొంగతనంగా పెళ్లి చేసుకోను

వయసు ఎప్పుడో 35 దాటిపోయింది. ప్రభాస్, రానా పెళ్లి గురించి జనాలు పట్టించుకున్నంతగా తరుణ్ పెళ్లి గురించి పట్టించుకోరు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ కాకపోయినా, తన పెళ్లిపై ఓ చిన్నపాటి క్లారిటీ ఇచ్చాడు తరుణ్.

"ప్రస్తుతానికైతే నా మైండ్ లో పెళ్లి ఆలోచన లేదు. ఇప్పుడప్పుడే చేసుకోను. ప్రతి ఇంటర్వ్యూలో చెబుతూనే ఉన్నాను. ఒకవేళ పెళ్లి సెట్ అయితే అందరికీ నేనే స్వయంగా చెబుతాను. అదేదో దొంగతనంగా చేసుకునేది కాదు కదా. హండ్రెడ్ పర్సెంట్ అలాంటిదేమైనా ఉంటే నేనే చెబుతాను". తన పెళ్లిపై తరుణ్ రియాక్షన్ ఇది.

నిజానికి ఆరేళ్ల కిందటే తరుణ్ పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వచ్చాయి. అప్పట్లో ఓ హీరోయిన్ తో ఈ హీరో డేటింగ్ చేశాడని, కానీ ఆ రిలేషన్ షిప్ వర్కవుట్ అవ్వలేదంటూ వార్తలు వచ్చాయి.

సదరు హీరోయిన్ కెరీర్ నాశనం అవ్వడానికి ఒక విధంగా తరుణ్ కూడా కారణం అంటూ పుకార్లు వచ్చాయి. అయితే 35క్రాస్ అయినా తనకింకా పెళ్లిపై మనసు మళ్లలేదంటున్నాడు తరుణ్.