cloudfront

Advertisement


Home > Movies - Movie News

హెచ్డీ లీకేజ్.. విజయ్ దేవరకొండకు కలిసొస్తుందా?

 హెచ్డీ లీకేజ్.. విజయ్ దేవరకొండకు కలిసొస్తుందా?

పైరేటెడ్ వెబ్ సైట్లు ఏ సినిమాను అయితే టార్గెట్ చేస్తారో.. ఏ సినిమా అయితే విడుదలకు ముందే లీకేజ్ బారిన పడుతూ ఉంటుందో.. అలాంటి సినిమాలు సూపర్ హిట్ అయిన దాఖలాలున్నాయి. అత్తారింటికి దారేదీ దగ్గర నుంచి ఇలాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. విడుదలకు ముందే అత్తారింటికి దారేదీ మొత్తం లీక్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

ఇక విజయ్ దేవరకొండకు కూడా ఇలాంటి అనుభవాలు ఏమీ కొత్త కాదు. ఈ హీరో సూపర్ హిట్ సినిమా ‘గీతగోవిందం” విడుదలకు ముందు లీకేజ్ ల బారిన పడింది. ఆ లీకేజ్ సీన్లు పెద్ద దుమారం రేపాయి. చివరకు ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సంచలన విజయం సాధించింది. వందకోట్ల రూపాయల వసూళ్ల మార్కును అందుకుంది.

ఇక విజయ్ తాజా సినిమా ‘టాక్సీవాలా”కు లీకేజ్ ఇక్కట్లు కొత్తవేమీ కావు. కొన్ని నెలల కిందటే ఈ సినిమా లీకేజ్ వీడియోలు వెలుగు చూశాయి. ఆ విషయంలో ఈ సినిమా రూపకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు కూడా. మరి ఆ కేసులు ఏమయ్యాయో కానీ.. తాజాగా ఈ సినిమా ఫుల్ హెచ్ డీ ప్రింట్ ను ఒక వెబ్ సైట్ విడుదల చేసింది.

విడుదలకు సమాయత్తం అవుతున్న ఈ సినిమా మొత్తాన్నీ.. హై క్లారిటీతో అప్ లోడ్ చేసింది ఆ వెబ్ సైట్. ఆ విషయంపై ఈ సినిమా రూపకర్తలు పోరాడుతూ ఉన్నారు. మరి ఇలాంటి లీకేజీ బాధిత సినిమాలన్నీ సంచలన విజయాలను సాధించాయి. అలాంటి పరం పరలోనే.. టాక్సీవాలా కూడా సూపర్ హిట్ అవుతుందేమో చూడాలి!

వెనక్కి చూడకుండా పారిపో!... చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్