cloudfront

Advertisement


Home > Movies - Movie News

విశాల్ పెళ్లి కబుర్లు..!

విశాల్ పెళ్లి కబుర్లు..!

తన తనయుడు విశాల్ కు పెళ్లి నిశ్చయించామని ఇటీవలే నిర్మాత జీకే రెడ్డి తెలిపిన సంగతి తెలిసిందే. వయసు ముదురుతున్న దక్షిణాది బ్రహ్మచారి హీరోల్లో ఒకడైన విశాల్ పెళ్లి విషయం ఆ విధంగా ధ్రువీకరణ పొందింది. అంతకు ముందు నటి, శరత్ కుమార్ కూతురు వరలక్ష్మితో ప్రేమాయణంతో  విశాల్ పెళ్లి మరింత ఆసక్తిదాయకంగా నిలిచింది.

ఈ నేపథ్యంలో విశాల్ తన పెళ్లి విషయం గురించి మాట్లాడాడు. హైదారబాద్ కు చెందిన విజయ్ రెడ్డి, పద్మజ కూతురు అనీషాను తను పెళ్ళి చేసుకోబోతున్నట్టుగా విశాల్ తెలిపాడు. అంతకు మించిన విశేషం ఏమిటంటే.. తమది ప్రేమ వివాహం అని విశాల్ ప్రకటించడం.

తమది కేవలం పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, ప్రేమ వివాహాన్నే పెద్దల సమ్మతితో చేసుకుంటున్నట్టుగా ఈ హీరో చెప్పాడు. త్వరలోనే నిశ్చితార్థం అని చెప్పాడు. చెన్నైలో నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తి కాగానే..అందులోనే తన పెళ్లి జరుగుతుందని విశాల్ మరోసారి స్పష్టతను ఇచ్చాడు.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?