cloudfront

Advertisement


Home > Movies - Movie News

వైఎస్ఆర్ నూ క్యాష్ చేసుకుంటున్న ఎన్టీఆర్!

వైఎస్ఆర్ నూ క్యాష్ చేసుకుంటున్న ఎన్టీఆర్!

ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో మిశ్రమ టాక్ వినిపిస్తోంది. ప్రత్యేకించి ఈ సినిమాలో చూపించిన కొన్ని నిజజీవిత పాత్రలు.. మరికొన్ని చూపించని నిజజీవిత పాత్రల విషయంలో ఆయా వ్యక్తుల గురించి, ఆయా సంఘటనల గురించి తెలిసినవారు రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు.

తమ బ్లడ్డూ, బ్రీడు వేరని బాలయ్య చెప్పుకుంటాడు.. అయితే కేవీరెడ్డి లాంటివాళ్లు పట్టుపట్టకపోయి ఉంటే.. ఎన్టీఆర్ పరిస్థితి ఏమిటి? నాగిరెడ్డో, చక్రపాణో పూర్తిగా తిరస్కరించి ఉంటే... ఎన్టీఆర్ గుర్తింపునకు నోచుకునేవాడా? అనే ప్రశ్నలను కూడా ఎన్టీఆర్ బయోపిక్ రైజ్ చేసిందనే కామెంట్ కూడా వెబ్ లో వినిపిస్తోంది.

ఇక ఈ సినిమా గురించి రకరకాల ముచ్చట్లగురించి జనాలు మాట్లాడుకొంటూ ఉన్నారు. ఇక ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ పార్ట్ లో ఆశ్చర్యపరిచిన విషయం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రస్తావన. సినిమా పూర్తిగా తెలుగుదేశం, ఎన్టీఆర్ అభిమానుల ఫ్లేవర్ లోకి వెళ్లిపోతే.. దెబ్బతింటామేమో అని ఒకింత వ్యూహాత్మకంగా వైఎస్ పాత్రను కూడా అలా టచ్ చేసి వదిలినట్టుగా ఉన్నారు.

ఎన్టీఆర్ బయోపిక్ లో వైఎస్ ప్రస్తావన అవసరం ఉండదని చెప్పనక్కర్లేదు. అయితే.. కొసమెరుపులా అలా వైఎస్ ప్రస్తావన తీసుకురావడం ద్వారా.. సినిమాపై మరింత ఆసక్తిని రేపినట్టుగా ఉన్నారు. ఆఖర్లో వైఎస్ ను చూపించారు, వైఎస్ ను చంద్రబాబు తీసుకెళ్లి తన మామకు పరిచయం చేస్తాడు.. అనే టాక్ సినిమా పై ఆ సైడ్ వాళ్లలో ఆసక్తిని రేపవచ్చు.

క్లైమాక్స్ కొసమెరుపులు సినిమాలకు ప్లస్ పాయింట్లు అవుతున్న రోజులు ఇవి! ఈ విధంగా వైఎస్ఆర్ ప్రస్తావనను ఎన్టీఆర్ సినిమాను క్యాష్ చేసుకుంటున్నట్టే. అంతేకాదు.. ఎన్టీఆర్ సెకెండ్ పార్ట్ లో కాంగ్రెస్ నేతగా వైఎస్ ప్రస్తావన కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

ప్రత్యేకించి చంద్రబాబు, వైఎస్ లను సన్నిహితులన్నట్టుగా.. అసెంబ్లీలో కూడా పక్కపక్కనే కూర్చుని చూపించడం.. వంటి విషయాలతో.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో... ప్రతిపక్షంలో వైఎస్ నేతగా కూడా కొనసాగిన చరిత్ర ఉంది కాబట్టి.. కొంచెం రసవత్తర రాజకీయ సన్నివేశాలు ఉండే అవకాశాలున్నాయి.

అనుభవంలేని క్రిష్‌, సాయిమాధవ్‌... ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారా?

హరికృష్ణ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ చేయాల్సింది