cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Press Releases

16న మిస్టర్ కె కె గ్రాండ్ ఫంక్షన్

16న మిస్టర్ కె కె గ్రాండ్ ఫంక్షన్

శివ‌పుత్రుడు, అప‌రిచితుడు చిత్రాల‌తో తెలుగులో స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న చియాన్ విక్ర‌మ్ క‌థానాయ‌కుడిగా అక్ష‌ర‌ హాస‌న్‌, అభిహాస‌న్ కీల‌క పాత్ర‌ల్లో రాజేష్ ఎం సెల్వ ద‌ర్శ‌క‌త్వంలో రూపోందిస్తున్న మిస్ట‌ర్ కెకె. పారిజాత మూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై ఈ  చిత్రాన్ని నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి. శ్రీధ‌ర్ లు తెలుగులో విడుదల చేస్తున్నారు.  

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను భారీగా ఈనెల 16న చేయాలని నిర్మాతలు డిసైడ్ చేసారు. ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్ అండ్ టి శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ..   ''ఇటీవ‌లే కిల్ల‌ర్ లాంటి సూప‌ర్‌డూప‌ర్ హిట్ చిత్రాన్ని అందించిన మా బ్యాన‌ర్ పారిజాత మూవీ క్రియేష‌న్స్ లో  మ‌రో  స‌న్సెష‌న‌ల్ ఫిల్మ్ మిస్ట‌ర్ కెకె జులై 19 న‌ విడుదల చేస్తున్నాము.  ఇటీవ‌ల విడుద‌ల చేసిన‌ ట్రైల‌ర్ లో విక్ర‌మ్ గెట‌ప్ గాని ఆయ‌న లుక్ బాగుందని టాక్ వచ్చింది.  కమల్ హాసన్ కుమార్తే అక్ష‌ర హాస‌న్ కూడా పెర్‌ఫార్మెన్స్ స్కోప్ వున్న పాత్రలో క‌నిపించింది. ఈ చిత్రం యెక్క ప్రీరిలీజ్ ఫంక్ష‌న్ జులై 16న గ్రాండ్ గా హైద‌రాబాద్ లో చేయ‌బోతున్నాము.. అని అన్నారు.

ఇటీవలికాలంలో విక్రమ్ సినిమాకు ఇంత రెస్పాన్స్ రావడం, అలాగే భారీగా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేయడం ఇదే అని, మంచి మంచి సినిమాలు ఎందుకుని, ప్లాన్డ్ గా ప్రచారం చేసి, తెలుగులో లాంచ్ చేయాలన్నది తమ సంకల్పమని, తమ బ్యానర్ మీద ఏటా అనేక సినిమాలు వరుసగా అందించడానికి ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. 

టీడీపీ స్థానాన్ని బీజేపీ ఆక్రమించగలదా?