cloudfront

Advertisement


Home > Movies - Press Releases

45 సెంటర్లలో ఛలో హాఫ్ సెంచరీ

45 సెంటర్లలో ఛలో హాఫ్ సెంచరీ

ఈ మధ్యకాలంలో హాఫ్ సెంచరీలు, సెంచరీలు అన్నవి సినిమాలకు కాస్త కష్టంగానే వుంది. అలాంటి టైమ్ లో ఏదయినా సినిమా కొన్ని సెంటర్లలోనైనా 50రోజులు ఆడిదంటే ఆనందమే. మొన్నటికి మొన్న భాగమతి అలాగే ఆడింది. ఆ తరువాత వచ్చిన ఛలో కూడా ఇప్పుడు 45సెంటర్లలో యాభై రోజులు పూర్తి చేసుకుంది. చిన్న సినిమాగా విడుదలైన ఛలో కాస్త గట్టి విజయమే సాధించింది.

నాగశౌర్య హీరోగా, ర‌ష్మిక హీరోయిన్‌గా వెంకీ కుడుములని ద‌ర్శకుడుగా ప‌రిచ‌యం చేస్తూ ఐరా క్రియేషన్స్ బ్యానర్లో శంకర్ ప్రసాద్ స‌మ‌ర్పణ‌లో, ఉష నిర్మాతగా నిర్మించిన చిత్రం ఛ‌లో. రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు అందుకున్న ఈ చిత్రానికి మొద‌టి నుంచి స్టడీగా ఆడుతూ వచ్చింది. ఇప్పటికీ ఇంతో అంతో షేర్ రాబడుతోంది. 

రేపటికి అంటే మార్చి 23నాటికి యాభై రోజులు పూర్తి చేసుకుంది. ఆంధ్ర, సీడెడ్ నైజాల్లో 45థియేటర్స్‌లో 50రోజులు స్ట్రయిట్ గా ఆడిన సందర్భంగా చిత్ర యూనిట్  తెలుగు ప్రేక్షకుల‌కి ధన్యవాదాలు తెలియచేసింది.