Advertisement


Home > Movies - Press Releases
హైఓల్టేజ్ యాక్షన్ షూట్‌కు అల్లు అర్జున్ రెడీ!

‘నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా’ అంటూ అల్లు అర్జున్ ఫక్తు యాక్షన్ ఎంటర్‌టైనర్ తో అభిమానుల్ని అలరించడానికి సమ్మర్ స్పెషల్ గా ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి.. హైఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రించడానికి ముహూర్తం కుదిరింది. నవంబరు 5వ తేదీనుంచి యాక్షన్ సన్నివేశాల చిత్రీకరించనున్నారు. శిరీష శ్రీధర్ నిర్మాతగా వక్కంతం వంశీని దర్శకుడిగా పరిచయం చేస్తూ తీస్తున్న చిత్రం ఇది. ఇందులో అనుపమా  పరమేశ్వరన్ నాయిక కాగా, స్టయిలిష్ స్టార్ అర్జున్ కు తోడుగా, యాక్షన్ కింగ్ అర్జున, శరత్ కుమార్ లు ఎడిషనల్ ఎడ్వాంటేజీలా ఉంటున్నారు. 

ఈ సందర్భంగా నిర్మాత శిరీష శ్రీధ‌ర్ మాట్లాడుతూ.. స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న భారీ చిత్రం "నా పేరు సూర్య - నా ఇల్లు ఇండియా" నవంబర్ 5 నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఈ షెడ్యూల్ లో అత్యంత కీలకమైన సన్నివేశాలతో పాటు రామ్ – లక్ష్మణ్ సారథ్యంలో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తారని వెల్లడించారు.  ఈ యాక్షన్ సీన్ల చిత్రీకరణ షెడ్యూలు ఏకంగా ఏడాది పాటు ఉంటుందని చెబుతున్నారు. 

సహనిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ.. ఏప్రిల్ 27న బన్నీ ఫ్యాన్స్ కు పండగ అవుతుందని, వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ఖుషీ విడుదల తేదీ కూడా అదే కావడం విశేషం. ఈ విడుదల తేదీనే ఇప్పుడు వివాదం అవుతోంది. మహేష్ ‘భరత్ అనే నేను’ చిత్రానికి కూడా ఇదే విడుదల తేదీ ప్రకటించారు. ఎవరో ఒకరు తేదీ మార్చుకోకుంటే.. చాలా కాలం తర్వాత.. ఒకే తేదీన ఇద్దరు పెద్ద హీరోల చిత్రాలు వస్తున్నట్లు అవుతుంది.