cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఆగస్టు 10న శ్రీనివాస కళ్యాణం

ఆగస్టు 10న శ్రీనివాస కళ్యాణం

నిర్మాత దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతూ నిర్మిస్తున్న సినిమా శ్రీనివాసకళ్యాణం. మహేష్ బాబుతో నిర్మిస్తున్న భారీ సినిమా లాంటిది కాదు. కానీ శతమానం భవతి తరువాత నిర్మిస్తున్న ఓ మంచి సినిమాగా దిల్ రాజు భావిస్తున్నారు. అదే సినిమా అందించిన దర్శకుడు సతీష్ వేగ్నిశనే ఈ సినిమాకు కూడా దర్శకుడు. కుటుంబ సంబంధాల నేపథ్యంలో శతమానం భవితి సినిమాను నిర్మించిన దిల్ రాజు, మానవ సంబంధాల నేపథ్యంలో శ్రీనివాస కళ్యాణం సినిమాను నిర్మిస్తున్నారు.

నితిన్-రాశీఖన్నా, నందిత శ్వేత, ప్రకాష్ రాజ్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్న శ్రీనివాస కళ్యాణం టాకీ మొత్తం ఈ నెలాఖరుకు పూర్తయిపోతుంది. జూలై ఫస్ట్ వీక్ లో రాజ్ తరుణ్ తో నిర్మించిన లవర్ సినిమా విడుదల తరువాత శ్రీనివాస కళ్యాణం ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. శ్రీనివాస కళ్యాణం తొలిసగం అంతా అర్బన్ బేస్డ్ గా, మలిసగం అంతా తెలుగునాట జరిగే పెళ్లిళ్ల నేపథ్యంలో సాగుతుంది.

ఇందుకోసం ఈస్ట్ గోదావరిలోని అమలాపురంలో నిరంతరంగా షూటింగ్ జరుపుతున్నారు. నిర్మాత దిల్ రాజు మిగిలిన పనులు పక్కన పెట్టి, ఈ సినిమా మీదే కూర్చున్నారు. గతంలో శతమానం భవతి సమయంలో కూడా ఆయనే దగ్గర వుంచి ఆ సినిమా పనులు ఆద్యంతం చూసుకున్నారు.

ప్రస్తుతానికి ఆగస్టు పదిన మరే సినిమా కూడా విడుదలయ్యే అవకాశంలేదు. నాగ్ చైతన్య సవ్యసాచి విడుదల వుంటుందని అంటున్నారు కానీ, వచ్చే అవకాశాలు తక్కువే.