Advertisement


Home > Movies - Press Releases
ఛలో స్టడీ @పోస్ట్ వీకెండ్

చిన్న సినిమాగా విడుదలై, పెద్ద సినిమాగా మారుతోంది వెంకీ కుడుమల దర్శకత్వం వహించిన ఛలో సినిమా. ఫస్ట్ వీకెండ్ లో మంచి ఫలితాలు నమోదు చేసింది. కొన్ని సెంటర్లలో బ్రేక్ ఈవెన్ దగ్గరకు వచ్చేసింది.

మండే నుంచి చూడాలి రన్ ఎలా వుంటుందో అనుకున్నారు. అయితే సోమ, మంగళ వారాలు కూడా మంచి కలెక్షన్లే రాబట్టింది. చిత్రంగా సి సెంటర్లలో కూడా స్టడీగా వుండడం, చాలా చోట్ల 80శాతానికి పైగా ఆక్యుపెన్సీ వుండడం విశేషం.

తొలి అయిదు రోజులకు ఛలో సినిమా 12కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించినట్లు నిర్మాత ఉష మాల్పూరి తెలియచేసారు. నైజాంలో అయిదున్నర కోట్లు గ్రాస్, సీడెడ్ లో కోటీ ముఫై లక్షల గ్రాస్, ఆంధ్రలో 5.95 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిందన్నారు.

హీరో నాగశౌర్య చేస్తున్న విజయయాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోందని, త్వరలో విశాఖలో భారీ విజయోత్సవ సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆమె తెలిపారు. ఛలో సినిమాకు సీనియర్ సంగీత దర్శకుడు మణిశర్మ కుమారుడు స్వరసాగర్ అందించిన పాటలు బాగా ప్లస్ కావడం విశేషం.