cloudfront

Advertisement


Home > Movies - Press Releases

ఘనంగా పేపర్ బాయ్ ఫంక్షన్..!!

ఘనంగా పేపర్ బాయ్ ఫంక్షన్..!!

దర్శకుడు సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధానపాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'.. ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ ఫంక్షన్  హైదరాబాద్ లో మంగళవారం రాత్రి జరిగింది. ఈ సందర్భంగా థియరిటికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు.. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు వివి వినాయక్, మెహర్ రమేష్, సుకుమార్, ఎన్. శంకర్, దశరథ్ , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ లు ముఖ్య అతిధులుగా వచ్చారు.

ఈ సందర్భంగా దర్శకుడు జయ శంకర్ మాట్లాడుతూ..  షార్ట్ ఫిలిం చూసి నాకు ఈ సినిమాని డైరెక్ట్ చేసే అవకాశం కల్పించిన ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ మురళి కి సంపత్ నంది గారికి థాంక్యూ సో మచ్.. గీత ఆర్ట్స్ కి పేపర్ బాయ్ టీం అంతా రుణపడి ఉంటుంది.. మా సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు అల్లు అరవింద్ గారికి చాల థాంక్స్.. ఈ సినిమా చుసిన తర్వాత సంతోష్ శోభన్ గురించి తప్పకుండా మాట్లాడుకుంటారు.. అంత బాగా యాక్ట్ చేసాడు..అన్నారు.

చిత్ర నిర్మాత సంపత్ నంది మాట్లాడుతూ.. ముందుగా ఈ సినిమా ట్రైలర్ చూసి ట్వీట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి , అలాగే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారికి మనస్ఫూర్తిగా థాంక్స్.. మొన్నటిదాకా ఈ సినిమా చాలా చిన్న సినిమా.. ఎప్పుడైతే గీత ఆర్ట్స్ ఈ సినిమా టేక్ అప్ చేసిందో అప్పడు జనాలకు ఈ సినిమా మరింత చేరువైంది.. అరవింద్ గారికి ఈ సినిమా చూసి నచ్చిందనగానే ఈ సినిమా హిట్ అని తెలిసిపోయింది.. అసలీ సినిమా ఒకటి ఉందని అల్లు అరవింద్ గారికి తెలియడానికి కారణం మెహర్ రమేష్ గారు.. ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను.. దర్శకుడు శోభన్ గారి అబ్బాయి సంతోష్ భవిష్యత్ చాల బాగా ఉంటుందని ఆశిస్తున్నా.. ఈ సినిమా కి పనిచేసిన అందరు టెక్నిషియన్స్ చాల బాగా చేశారు.. అందరికి చాలా థాంక్స్.

దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ.. పేపర్ బాయ్ సినిమా లోని కొన్ని సీన్స్ చూసి చాల ఎక్జియిట్ అయ్యాను. గీత ఆర్ట్స్ ఈ సినిమా ని టేక్ అప్ చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచేసింది.. ఒక డైరెక్టర్ అయ్యి ఉండి మరో డైరెక్టర్ కి అవకాశం ఇవ్వడం నిజంగా గొప్ప విషయం.. సంతోష్ మంచి ఎమోషనల్ గా నటించాడు.

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ఈ సినిమాని చూడాలని నా దగ్గరికి మెహర్ రమేష్ వచ్చారు.. ఆ తర్వాత చూసాక ఈ సినిమా నాకు చాలా నచ్చింది..  అందుకే ఈ సినిమా నేను డిస్ట్రిబ్యూషన్ కి తీసుకున్నాను.. గీత గోవిందం సినిమా హిట్ లో ఉన్న మేము ఈ సినిమా కూడా రిలీజ్ చేస్తే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అనుకుని ఈ సినిమాని టెక్ ఓవర్ చేసాను.. కొన్ని సినిమాలు ఎంత బాగున్నా జనంలోకి వెళ్లకండానే కనుమరుగైపోతాయి.. అలా ఇంత మంచి సినిమా అవకూడదని తీసుకోవడం జరిగింది.. సంపత్ నంది ఓ యంగ్ స్టర్ కి అవకాశం ఇచ్చి, తాను ప్రొడ్యూసర్ గా నిర్మించి తీసిన ఇంత గొప్ప సినిమా ని రిలీజ్ చేస్తునందుకు మాకు గర్వకారణం గా వుంది.

సినిమా హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. ఇక్కడికి వచ్చిన అతిధులకు , ప్రేక్షకులకు చాల థాంక్స్.. అల్లు అరవింద్ గారితో పనిచేయడం నా కల నెరవేరిందని చెప్పాలి.. మా సినిమానిసప్పోర్ట్ చేసిన అల్లు అరవింద్ గారికి చాల థాంక్స్.. మమ్మల్ని నమ్మి, నాతో సినిమా చేసిన సంపత్ నంది గారికి చాల థాంక్స్ ప్రొడ్యూసర్స్ గారికి నా కృతజ్ఞతలు.. డైరెక్టర్ జయశంకర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. నాకేమాత్రం పేరొచ్చినా దానికి జయశంకర్ గారే కారణం.. అన్నారు.