Advertisement


Home > Movies - Press Releases
జయమ్ము కోసం సెల్రబిటీలు

జయమ్ము నిశ్చయమ్మురా ప్రీమియర్ షో బుధవారం రాత్రి హైదరాబాద్ శాంతి థియేటర్ లో ప్రదర్శించారు. హీరో శ్రీనివాస రెడ్డికి ఇండస్ట్రీతో వున్న సత్సంబంధాలు, నిర్మాత దర్శకుడు రాజ్ కనుమూరికి వున్న అనుబంధాలకు ఈ షో అద్దం పట్టింది. సినిమా రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు, నటులు, రచయితలు, దర్శకులు ఈ షో కి పనిగట్టుకుని హాజరయ్యారు. 

పని గట్టుకుని అని ఎందుకు అనడం అంటే, ఈ షో ఏర్పాటు చేసింది, ఊరికి ఓ మూలగా వున్న నారాయణ గూడ శాంతి థియేటర్ లో. పైగా రాత్రి తొమ్మిది గంటల వేళ. అలాంటి టైమ్ లో అంత దూరం రావడం అంటే హైదరాబాద్ ట్రాఫిక్ లో కాస్త చికాకైన పని. అదే ఐమాక్స్, సినీమాక్స్, ప్రసాద్ ల్యాబ్ అంటే వేరు. అయినా కూడా సినిమా జనాలు వచ్చారు. 

శాంతి లాంటి భారీ థియేటర్ కిటకిటలాడిపోయింది. హీరో శ్రీనివాసరెడ్డి ఓ వారం రోజులు జిమ్ కు వెళ్లకుండా మానేసినా ఫరవాలేదు. ఎందుకంటే వచ్చిన ప్రతి అతిథిని తీసుకుని, థియేటర్ పైకి వెళ్లడం, కూర్చో పెట్టడం, మళ్లీ కిందకు వచ్చి మరొకర్ని రిసీవ్ చేసుకోవడం. ఇదే పెద్ద ఎక్స్ ర్ సైజ్ అయిపోయింది. మొత్తానికి కమెడియన్ గా సినిమా రంగం అభిమానం బాగానే సంపాదించారు శ్రీనివాసరెడ్డి.