cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల

'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ 'కల్కి'. శివానీ, శివాత్మిక సమర్పణలో హ్యాపీ మూవీస్ పతాకంపై ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ నిర్మించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'అ!' వంటి ప్రయోగాత్మక, కొత్త తరహా చిత్రం తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రమిది. 

ఈ నెల 28న  ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ సినిమా రిలీజ్ రైట్స్ ను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె. రాధామోహన్ సొంతం చేసుకున్నారు. హైదరాబాద్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ప్రశాంత్ వర్మ 'కల్కి' హానెస్ట్ ట్రైలర్ విడుదల చేశారు. 

ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మ... నాకు సపోర్ట్‌గా ఇద్దరు సూపర్‌ డైరెక్టర్స్‌ ఉన్నారనే ఫీల్‌తో ఉన్నాను. ఇంతకు ముందు కోడి రామకృష్ణగారు, ముత్యాల సుబ్బయ్యగారు, రవిరాజా పినిశెట్టిగారు... నాతో చాలా ఎక్కువ సినిమాలు చేశారు. నేను ఎప్పుడైనా కమర్షియల్‌గా కిందకు దిగితే వాళ్లు కాపాడతారనే విశ్వాసం, ధైర్యం ఉండేవి. ఇప్పుడు ప్రవీణ్‌ సత్తారు, ప్రశాంత్‌ వర్మతో ధైర్యం వచ్చింది. ‘కల్కి’. నేనింకా సినిమా చూడలేదు. జస్ట్‌ మూడు రీళ్లు మాత్రమే చూశా. ఎందుకంటే... ఫీల్‌ ఎలా ఉందని!  మా పిల్లలు ఫస్టాఫ్‌ వరకు చూడమన్నారు. నేను చూడలేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. దీనంతటికీ సినిమా మీద వున్న నమ్మకం. ‘ప్రశాంత్‌! మనం గరుడవేగ బీట్‌ చేయాలి. నీ వల్ల కుదురుతుందా?’ అన్నాను. కష్టపడి సినిమా చేశాం. రీచ్‌ అయ్యామనే అనుకుంటున్నాం. ‘కల్కి’ తర్వాత ‘గరుడవేగ 2’ చేస్తున్నా.’’ అన్నారు.

సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘నేను మా చెల్లెలు జీవిత,  మా పిల్లలు శివాని, శివాత్మిక కొరకు ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించా.  నేను సినిమా చూశా. అంతకు ముందు రషెస్‌ ఏవీ చూడలేదు. నిర్మాతగా చెబుతున్నా... కథ విన్నప్పుడు డిఫరెంట్‌ సబ్జెక్ట్‌, ఈ రోజుల్లో దర్శకులు డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారని అనుకున్నా. థియేటర్‌లో లాస్ట్‌ రీల్‌ వరకూ ఆసక్తిగా చూశాను. అంత క్యూరియాసిటీ కలిగించింది. టెక్నికల్‌ వేల్యూస్‌తో, హై బడ్జెట్‌తో తీసిన చిత్రమిది. ఈ సినిమా తర్వాత ‘మళ్లీ గరుడవేగ, కల్కి వంటి సినిమాలు ఎప్పుడు చేస్తారు?’ అని అందరూ అడుగుతారు. అంత మంచి చిత్రమిది. 

జీవితా రాజశేఖర్‌ మాట్లాడుతూ  రకరకాల టెన్షన్స్‌ మధ్య ‘కల్కి’ కథ విన్నాం. దీని ఒరిజినల్‌ రైటర్‌ సాయి తేజ. తను కథ వినిపించాడు. ప్రశాంత్‌ వర్మకు స్ర్కిప్ట్‌ విల్‌ అని కంపెనీ ఉంది. అందులో ఫుల్‌ స్ర్కిప్ట్‌, స్ర్కీన్‌ప్లే రెడీ అయ్యాక... ‘ప్రశాంత్‌ నువ్వే డైరెక్ట్‌ చేస్తే బావుంటుంది’ అని అడిగితే ‘సరే’ అన్నాడు. నేనే నిర్మాతగా స్టార్ట్‌ చేశాం. సి. కల్యాణ్‌ అన్నయ్యను కలిసినపుడు మనం పార్టనర్స్‌గా చేద్దాం’ అని కల్యాణ్‌ అన్నయ్య జాయిన్‌ అయ్యారు. అన్నారు. 

ప్రశాంత్‌ వర్మ మాట్లాడుతూ ‘‘ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముందే హానెస్ట్‌ ట్రైలర్‌ విడుదల చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పే విధంగా మోషన్‌ పోస్టర్‌, టీజర్‌, కమర్షియల్‌ ట్రైలర్‌, ఇప్పుడీ హానెస్ట్‌ ట్రైలర్‌ డిజైన్‌ చేశాం.  సినిమాలో కామెడీ, ఐటమ్‌ సాంగ్‌, కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ అన్నీ ఉన్నాయి. ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి కమర్షియల్‌ ట్రైలర్‌ కట్‌ చేశాం. సినిమా ఏంటనేది ఈ హానెస్ట్‌ ట్రైలర్‌ చెబుతుంది. 1983 నేపథ్యంలో కథ సాగుతుంది.

ఎక్కువ లొకేషన్స్‌లో భారీగా తీశాం. డేంజరస్‌ లొకేషన్స్‌లోనూ షూట్‌ చేశాం. సినిమా బ్లాక్‌బస్టర్‌ అయితేనే సినిమా బడ్జెట్‌ రాబట్టుకోగలం. సినిమా చూశాక... అందరూ ‘కల్కి 2’ కోసం వెయిట్‌ చేస్తారు. సినిమాలో రెండు పాటలే ఉన్నాయి. నాలుగు థీమ్‌ సాంగ్స్‌ ఉన్నాయి. అవి మూడు భాషల్లో ఉంటాయి’’ అన్నారు. 

ప్రవీణ్ సత్తారు, సిద్ధూ జొన్నలగడ్డ , కృష్ణచైతన్య తదితరులు ప్రసంగించారు.

చంద్రబాబు వ్యూహాలే ఇప్పుడు ఆయనకు పాశాలా