cloudfront

Advertisement


Home > Movies - Press Releases

కార్తికేయ 90 ఎమ్ ఎల్

కార్తికేయ 90 ఎమ్ ఎల్

`ఆర్‌.ఎక్స్.100` సినిమా టైటిల్‌కి త‌గ్గట్టుగానే బాక్సాఫీస్ ద‌గ్గర ఝుమ్‌... ఝుమ్మంటూ సంద‌డి చేసింది. న్యూవేవ్ సినిమాగా, క‌ల్ట్ మూవీగా మంచి విజ‌యాన్నిస్వంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని తెర‌కెక్కించిన కార్తికేయ క్రియేటివ్ వ‌ర్క్స్, ఆ సినిమా ద్వారా గుర్తింపు పొందిన హీరో కార్తికేయ‌ కాంబినేష‌న్‌లో మరో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్ నే 90ఎమ్ఎల్.

ఈ చిత్రంలో కార్తికేయ స‌ర‌స‌న నేహా సోలంకి నాయిక‌గా న‌టిస్తున్నారు. శేఖ‌ర్ రెడ్డి ఎర్ర ద‌ర్శకుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. అశోక్ రెడ్డి గుమ్మకొండ నిర్మాత. 90 ఎమ్ ఎల్ అనగానే మందు ప్రియులకు ఇట్టే అర్థం అయిపోతుంది. అలాంటి టైటిల్ పెట్టడం, ఫస్ట్ లుక్ లో బోలెడు మందు సీసాల మీద హీరోను పడుకోపెట్టడం, మందు కొట్టడానికి హక్కు వుంది అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టడం చూస్తుంటే మళ్లీ మరో వైవిధ్యమైన సబ్జెక్ట్ ను తీసుకున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే 70 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తయింది. మొత్తం ఆరు పాట‌లున్నాయి. అనూప్ రూబెన్స్ సంగీతానికి, చంద్రబోస్‌ పాటలు రాసారు. `రంగ‌స్థలం` త‌ర్వాత చంద్రబోస్ మ‌ళ్లీ సింగిల్ కార్డు రాసింది ఈ సినిమాకే. ఈ నెలాఖరుతో దాదాపు సినిమా మొత్తం పూర్తవుతుంది.