cloudfront

Advertisement


Home > Movies - Press Releases

మరో త్రీడీ సినిమా రెడీ

మరో త్రీడీ సినిమా రెడీ

రోబో 2.0 సినిమా త్రీడీలో హాలీవుడ్ సినిమాలను మరిపించేలా తయారైంది.కలెక్షన్ల హల్ చల్ సాగిస్తోంది. ఇది థియేటర్లలో వుండగానే ఓ భారీ హాలీవుడ్ త్రీడీ చిత్రం రాబోతోంది.ఈనెల 14న  భారీ స్థాయిలో `ఆక్వామేన్` అనే హాలీవుడ్ సినిమాను విడుదల చేస్తున్నారు. పైగా ఈ సినిమా అమెరికాలో కన్నా ముందుగా మన తెలుగునాట విడుదల కావడం విశేషం.

జేస‌న్ మ‌మోవా, అంబ‌ర్ హియ‌ర్డ్ క‌లిసి న‌టించిన చిత్రం `అక్వామేన్` . జేమ్స్ వాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన  యాక్ష‌న్ ప్యాక్డ్ అడ్వంచ‌ర‌స్  చిత్ర‌మిది. జేస‌న్ మ‌మోవా టైటిల్ రోల్‌లో క‌నిపిస్తారు.  ఈ సినిమాను డిసెంబర్ 14న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

యు.ఎస్‌.క‌న్నా ఒక వారం ముందుగా ఇండియాలో ఇంగ్లిష్‌, హిందీ, త‌మిళ్‌, తెలుగులో విడుద‌ల కానుంది. వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్  పిక్చ‌ర్స్ త్రీడీలోనూ, ఐమాక్స్ త్రీడీలోనూ విడుద‌ల చేయ‌నుంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. రోబో సినిమాను కూడా ఆయనే విడుదల చేయడం విశేషం.