Advertisement


Home > Movies - Press Releases
నాగశౌర్య కెరీర్ లోనే

హీరో నాగశౌర్య  కెరీర్ లోనే పెద్ద విడుదల కాబోతోంది ఛలో సినిమా. ఈ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అయిపోతోంది. యుఎస్ లో నాగశౌర్య సినిమాను తొలిసారి 118 చోట్ల ప్రీమియర్లు ప్లాన్ చేయడం విశేషం. ఈ ఛలో సినిమా పై సెన్సారు అనంతరం మంచి టాక్ వుంది ఇండస్ట్రీలో.

దాంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు నాలుగు వందలకు పైగా స్క్రీన్లలో ఛలో ను విడుదల చేస్తున్నారు. నైజాం ఒక్కటే డైరక్ట్ రిలీజ్. మిగిలిన ఏరియాలు, ఓవర్ సీస్, డిజిటల్, శాటిలైట్, హిందీ అన్నీ కలిసి 8 కోట్ల బిజినెస్ చేసారు. సీడెడ్ ను 70 లక్షలకు, ఆంధ్రను మూడు కోట్ల రేషియోలో విక్రయించారు. 

ఇప్పటికే అడియో మాంచి హిట్ అయింది.సెన్సారు అనంతరం ఇండస్ట్రీలో ఎక్కువగా ఛలో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుందన్న టాక్ స్ఫ్రెడ్ అయింది. పోటీగా రవితేజ సినిమా విడుదలవుతున్నా, ఓపెనింగ్ బాగానే వుంటాయన్న ధీమాతో ఛలో ముందుకు వెళ్తోంది.