cloudfront

Advertisement


Home > Movies - Press Releases

నర్తనశాల సోలో అడ్వాంటేజ్

నర్తనశాల సోలో అడ్వాంటేజ్

ఓవర్ సీస్ మార్కెట్ లో గూఢచారి ఆ తరువాత గీతగోవిందం తమ తమ సత్తా చాటాయి. దగ్గరలో మళ్లీ మరో సినిమా వుందీ అంటే అది @నర్తనశాల మాత్రమే. వాస్తవానికి నర్తనశాలతో పాటు శైలజారెడ్డి అల్లుడు సినిమా కూడా విడుదల కావాల్సింది. అలా విడుదలై వుంటే పరిస్థితి ఎలా వుండేదో తెలియదు కానీ, ఇప్పుడు అయితే ప్రీరిలీజ్ హంగామా మాత్రం నర్తనశాలకు అనుకూలంగా వుంది.

మొన్నటి వరకు నర్తనశాల డిస్ట్రిబ్యూటర్ చాలా ఏరియాలు కిందకు ఇవ్వకుండా పెండింగ్ లో వుంచారు. కానీ ఎప్పుడైతే అఫీషియల్ గా శైలజారెడ్డి అల్లుడు వాయిదా వార్త బయటకు వచ్చిందో, ఏరియాలు అన్నీ క్లీన్ స్వీప్ తో బిజినెస్ చేసేసినట్లు తెలుస్తోంది.

ఛలో సినిమా హిట్ తరువాత ఓవర్ సీస్ మార్కెట్ మీద కాస్త నమ్మకం వచ్చింది హీరో నాగశౌర్యకు. అందుకే నర్తనశాల సినిమాను ఏకంగా 135 లోకేషన్లలో విడుదల చేస్తున్నారు. నాగశౌర్య కేరీర్ లో ఇది ఎక్కువే.  మరి ప్రీమియర్ వసూళ్లు ఎలా వుంటాయో చూడాలి. ఛలో సినిమా 94వేల డాలర్ల వరకు వసూలు చేసింది. టోటల్ రన్ లో ఏడున్నర లక్షల డాలర్ల వరకు వసూలుచేసింది. నర్తనశాల క్రేజ్ ఎలా వుంటుందో చూడాలి.