cloudfront

Advertisement


Home > Movies - Press Releases

'నాటకం' సక్సెస్ మీట్

'నాటకం' సక్సెస్ మీట్

ఆశిష్ గాంధీ, ఆషిమా నర్వాల్ హీరో హీరోయిన్లుగా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తయారైన చిత్రం 'నాటకం'. కళ్యాణ్ జి గోగన దర్శకుడు. సాయికార్తీక్ సంగీతం అందించగా గరుడవేగతో మంచి పేరు తెచ్చుకున్న అంజి సినిమాటోగ్రఫీని అందించారు..  ఈ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఘనంగా రిలీజ్ అయ్యింది.  ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను ఈరోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సినిమా టీం మొత్తం హాజరయింది.

ఈ సందర్భంగా నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ.. కంటెంట్ ను నమ్మి సినిమాని కొన్నందుకు, ప్రేక్షకులు ఆదరించినందుకు ఆనందంగా వుందన్నారు. అందరు కష్టపడి చేసిన సినిమా ఇది.. చిన్న సినిమా, అదీ అందరు కొత్త ఆర్టిస్టులతో వచ్చిన సినిమా ఇలాంటి సినిమా హిట్ చేసినందుకు చాల చాల థాంక్స్ అన్నారు..

హీరో ఆశిష్ గాంధీ మాట్లాడుతూ..  అందరూ ఫోన్ చేసి సినిమా చాలా బాగుందని అంటున్నారు. మంచి రెస్పాన్స్ వచ్చింది.. సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన అందరికి ధన్యవాదాలు అన్నారు.. 

మ్యూజిక్ డైరెక్టర్ సాయికార్తీక్ మాట్లాడుతూ చిన్న సినిమాలను ఆదరిస్తారని మరోసారి రుజువైంది. రివ్యూస్ కూడా చాల బాగా వచ్చాయి. ఈ సినిమా కి పనిచేసిన అందరికోసం ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.