cloudfront

Advertisement


Home > Movies - Press Releases

పండగ డిజైనర్ థని

పండగ డిజైనర్ థని

టాలీవుడ్ లో టాప్ డిజైనర్లు నలుగురైదుగురులో ధని ఏలె ఒకరు. సినిమా ఎసెన్స్ పట్టుకుని, డిజైన్లు ఓ కాన్సెప్ట్ తో డిజైన్ చేయడం అతని ప్రత్యేకత. అలాంటి థని ఏలె ఈ సంక్రాంతి సినిమాల్లో మెజారిటీ సినిమాలు తనే డిజైన్ చేసి, తన ప్రత్యేకతను నిలబెట్టుకున్నారు. ఇప్పటి వరకు వందలాది సినిమాలకు డిజైనర్ గా పనిచేసిన థని, ఈ సంక్రాంతికి విడుదలవుతున్న రెండు భారీ సినిమాలకు డిజైన్లు అందించారు.

రామ్ చరణ్ వినయ విధేయరామ, ఎన్టీఆర్ బయోపిక్ రెండింటికీ థని పనిచేసారు. ముఖ్యంగా బయోపిక్ కు పనిచేయడం గొప్ప అనుభవం అని. ఇంత పెద్ద సంఖ్యలో స్టిల్స్, పోస్టర్లు, డిజైన్లు మరే సినిమాకు చేయలేదని ధని అన్నారు. వాడిన స్టిల్ వాడాల్సిన అవసరం రాలేనంతగా లెక్కకు మించిన స్టిల్స్ వున్నాయని, సినిమాలో వున్న పాత్రలు, వేషాలు అలా కుదిరాయని ఆయన చెప్పారు. 

అలాగే బోయపాటి ఆలోచన మేరకు వినయ విధేయ రామ టైటిల్ లోగో తయారుచేసి ఓకే చేయించుకోగలిగానన్నారు. అంత పెద్ద లెంగ్తీ టైటల్ ను లోగోలో చక్కగా ఇమిడ్చానని ప్రశంసలు వచ్చాయన్నారు ధని ఏలె.

జగన్‌తో పవన్‌ పొత్తు ఎందుకు కుదరలేదంటే?

కేసీఆర్ ఫ్రంట్ ఇక అంతేనా.. చదవండి ఈవారం గ్రేట్ ఆంధ్ర పేపర్